ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఖాతా తెరవాలన్న దక్షిణాఫ్రికా నిరీక్షణకు ఇటీవలే తెరపడింది. కానీ ఆ సంతోషం ఎన్నో రోజులు నిలవలేదు. ఇంగ్లాండ్‌పై తొలి టెస్టు గెలిచి 30 పాయింట్లు సాధించిన సఫారీ సేనకు షాకిచ్చింది ఐసీసీ. వచ్చిన వాటిలో ఆరు పాయింట్ల కోత విధించిది. ఛాంపియన్ షిప్లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఇలా కోత విధించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం 24 పాయింట్లతో జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతోంది దక్షిణాఫ్రికా.
టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్ల్ పట్టికలో 360 పాయింట్లతో భారత్ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (296) ఇంగ్లాండ్ (146), పాకిస్థాన్ (80), శ్రీలంక (80), న్యూజిలాండ్ (60) ఉన్నాయి. దక్షిణాఫ్రికా (24), వెస్టిండీస్ (0), బంగ్లాదేశ్ (0) చివరి మూడు స్థానాల్లో నిలిచాయి.