తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత జట్టును మరోస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి 'గంగూలీ' - గంగూలీ పుట్టినరోజు

భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు గంగూలీ పుట్టినరోజు సందర్భంగా.. పలువురు క్రీడా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.

భారత జట్టును మరోస్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి 'గంగూలీ'
గంగూలీ పుట్టినరోజు

By

Published : Jul 8, 2020, 11:43 AM IST

బీసీసీఐ అధ్యక్షుడు, టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ.. 48వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. #HappyBirthdayDada పేరుతో ట్విట్టర్​లో పోస్టులు పెడుతున్నారు. దాదాతో తమకున్న అనుబంధాన్ని ఫొటోల రూపంలో అభిమానులతో పంచుకుంటున్నారు. వీరిలో దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్, మాజీ క్రికెటర్లు కైఫ్, ఆకాశ్ చోప్రా, సెహ్వాగ్, ప్రజ్ఞాన్ ఓజాతో పాటు ప్రస్తుత టీమ్​ఇండియా ఆటగాళ్లు శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details