తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీని ట్రోల్ చేసిన కుమార్తె సనా - సన గంగూలీ

సౌరభ్ గంగూలీ ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ చేసి కూతురు సనా చేతిలో ట్రోలింగ్​కు గురయ్యాడీ మాజీ సారథి.

Sourav Ganguly
గంగూలీ

By

Published : Dec 30, 2019, 10:47 AM IST

భారత క్రికెట్‌లో అత్యున్నత పదవిలో కొనసాగుతున్నాడు టీమిండియా మాజీ సారథి సౌరభ్‌ గంగూలీ. బీసీసీఐలో పలు సంస్కరణలు తెచ్చేందుకు ఎంతో కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే నవంబర్‌లో తొలి పింక్‌ బాల్‌ టెస్టు నిర్వహించి అందరి ప్రశంసలు పొందాడు. అలాగే ఇప్పుడు నాలుగు పెద్ద జట్లతో కలిసి ‘సూపర్‌ సిరీస్‌’ నిర్వహించాలనే ఉద్దేశంతో ఉన్నాడు.

అయితే గంగూలీ ఆదివారం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫొటో పోస్టు చేసి తన కుమార్తె సనా చేతిలో ట్రోలింగ్‌కు గురయ్యాడు. "ఆదివారం నాడు పనిచేయడం అస్సలు నచ్చదు" అని గంగూలీ పోస్ట్ చేశాడు. సనా వెంటనే స్పందించింది. "పని చేయకుండా 12 గంటల వరకు బెడ్‌మీద ఎవరుంటారో చెప్పండి" అని సరదాగా వ్యాఖ్యానించింది.

సన కామెంట్

సనా ఇంతకుముందు పౌరసత్వ చట్టంపై ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో ఒక పోస్టు పెట్టి వివాదంలో చిక్కుకుంది. గంగూలీ జోక్యం చేసుకుని తన కూతురికి రాజకీయాల పట్ల అవగాహన లేదని, తనని వివాదాలకు దూరంగా ఉంచాలని కోరిన కారణంగా అది కాస్తా సద్దుమణిగింది.

ఇవీ చూడండి.. దిల్లీ క్రికెట్ సంఘాన్ని రద్దు చేయమంటోన్న గంభీర్

ABOUT THE AUTHOR

...view details