తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీ గురించి మీకు ఈ విషయాలు తెలుసా..! - ganguly bcci

బీసీసీఐ అధ్యక్ష పదవికి నామినేషన్ వేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఒకే దరఖాస్తు రావడం వల్ల ఈ నెల 23న బాధ్యతలు స్వీకరించనున్నాడు. ఈ సందర్భంగా గంగూలీ గురించి కొన్ని విషయాలు చూద్దాం.

గంగూలీ

By

Published : Oct 17, 2019, 5:22 PM IST

Updated : Oct 17, 2019, 7:02 PM IST

గంగూలీ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు

తన కెప్టెన్సీతో భారత క్రికెట్​ రూపురేఖలు మార్చిన సారథుల్లో సౌరవ్ గంగూలీ ముందుంటాడు. విదేశాల్లో టీమిండియా సత్తాచాటడానికి దోహదపడ్డాడు. విజయవంతమైన కెప్టెన్​గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు భారత క్రికెట్​ను నియంత్రించే బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టబోతున్నాడు. ఈ సందర్భంగా దాదా గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

  • గంగూలీకి 'ప్రిన్స్ ఆఫ్ కలకత్తా' అనే బిరుదు ఇచ్చాడు మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ జెఫ్రీ బాయ్​కాట్. కానీ అంతకంటే ముందే దాదా తండ్రి అతడికి 'మహరాజ్' అనే ముద్దుపేరు పెట్టాడు.
  • 1992లో వెస్టిండీస్​పై అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన గంగూలీ.. ఈ మ్యాచ్​లో మూడు పరుగులకే పెవిలియన్ చేరాడు. అనంతరం నాలుగేళ్ల పాటు అతడికి ఉద్వాసన పలికింది యాజమాన్యం. ఆటగాళ్లకు డ్రింక్స్​ పట్టుకురావడాన్ని నిరాకరించడం వల్ల అతడి ప్రవర్తన బాగా లేదని జట్టు నుంచి తొలగించారనే పుకార్లూ ఉన్నాయి.
  • జట్టుకు దూరమైన సౌరవ్.. ఓ బౌలింగ్ వేసే యంత్రాన్ని కొనుగోలు చేసి ఇంటివద్దే ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టాడు.
  • నాలుగేళ్ల తర్వాత ప్రసిద్ధ లార్డ్స్​ మైదానంలో టెస్టు అరంగేట్రం (1996) చేశాడు దాదా. అదే మ్యాచ్​లో సెంచరీ (131)తో అదరగొట్టాడు. కెరీర్​లో అక్కడ తొలి టెస్టు మ్యాచ్​ ఆడుతూ అత్యధిక స్కోర్ చేసిన వారిలో ఇప్పటికీ గంగూలీదే రికార్డు.
  • 2003 ప్రపంచకప్​లో సెంచరీ చేయడం ద్వారా వరల్డ్​కప్ నాకౌట్​ మ్యాచ్​ల్లో సెంచరీ చేసిన తొలి భారత క్రికెటర్​గా ఘనత సాధించాడు. కెన్యాతో జరిగిన మ్యాచ్​లో 111 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
  • టీమిండియా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఎడమ చేతివాటం బ్యాట్స్​మన్​గా గంగూలీ పేరిటే రికార్డు ఉంది. రెండు ఫార్మాట్లలో(వన్డే, టెస్టు) కలిపి మొత్తం 18,433 పరుగులు చేశాడీ క్రికెటర్. (టెస్టుల్లో 7,212.. వన్డేల్లో 11,221)
  • అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా ఎడమ చేతి వాటం బ్యాట్స్​మెన్​ రికార్డు గంగూలీ పేరిటే ఉంది. వన్డేల్లో 22, టెస్టుల్లో 16 చేశాడు.
  • గంగూలీ ఒకసారి (1996) ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్​కు దిగాడు. పాకిస్థాన్​తో జరిగిన ఈ మ్యాచ్​లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు.
  • వన్డేల్లో 10 వేల పరుగులు, 100 వికెట్లు, 100 క్యాచ్​లు పట్టిన ఐదుగురు క్రికెటర్లలో గంగూలీ ఒకడు. సచిన్, సనత్ జయసూర్య, కలిస్, దిల్షాన్ అతడి కంటే ముందున్నారు.
  • గంగూలీ శతకం చేసిన ఏ టెస్టు మ్యాచ్​లోనూ భారత్ ఓడిపోలేదు.
  • మొదటి కుడి చేతి వాటం​ బ్యాట్స్​మన్​గా ఉన్న గంగూలీ.. సోదరుడి కిట్ వాడటం కోసం ఎడమచేతి వాటంకు మారాడు.
  • గంగూలీకి భక్తి ఎక్కువ. ప్రతి మంగళవరం ఉపవాసం ఉండటం అలవాటు
Last Updated : Oct 17, 2019, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details