తెలంగాణ

telangana

ETV Bharat / sports

గంగూలీ, జైషా భవితవ్యం తేలేది నేడే...! - bcci latest news

బీసీసీఐ రాజ్యాంగంలో మార్పులకు అవకాశమివ్వాలన్న గంగూలీ బృందం వ్యాజ్యంపై నేడు(బుధవారం) విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు. అంతేకాకుండా కూలింగ్​ పీరియడ్​పైనా నిర్ణయం తీసుకుంటే.. గంగూలీ, షా పదవీకాలంపై స్పష్టత రానుంది.

bcci news
గంగూలీ, జైషా భవితవ్యం తేలేది నేడే...!

By

Published : Jul 22, 2020, 12:41 PM IST

'బీసీసీఐ వర్సెస్​ బిహార్​ క్రికెట్​ అసోసియేషన్'​ కేసు నేడు సుప్రీం కోర్టు ముందుకు విచారణకు రానుంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎస్​.ఏ బోబ్డే అధ్యక్షతన ఈ కేసుపై విచారణ జరగనుంది. బీసీసీఐ రాజ్యంగ సవరణ, కూలింగ్​ పీరియడ్ వంటి అంశాలపై కీలక నిర్ణయం ప్రకటించనున్నారు. అదే జరిగితే గంగూలీ, షా ద్వయం పదవీ కాలంపై స్పష్టత రానుంది.

బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ

తొమ్మిది నెలల్లోనే...

బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, సెక్రటరీ షా పదవీకాలాన్ని 2025 వరకు పొడిగించాలని ఏప్రిల్​ 21న అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది బీసీసీఐ. 2019 అక్టోబర్​లో వీరిద్దరూ పదవులు చేపట్టారు. అయితే లోథా కమిటీ సంస్కరణల్లో భాగంగా విధించిన కూలింగ్​ పీరియడ్​తో వీరు కేవలం తొమ్మిది నెలలు మాత్రమే పదవిలో కొనసాగేందుకు వీలుంది. ఎవరైనా ఆరేళ్ల పాటు రాష్ట్ర సంఘాలు లేదా బీసీసీఐలో పనిచేస్తే కచ్చితంగా మూడేళ్ల పాటు మళ్లీ మరో పదవి అధిరోహించేందుకు వీలులేదు. గతంలో గంగూలీ బెంగాల్ అసోసియేషన్​లోనూ, షా గుజరాత్​ క్రికెట్​ అసోసియేషన్​లోనూ దాదాపు ఐదేళ్లకు పైగా పనిచేశారు.

'మాకేం అభ్యంతరం లేదు...'

2013లో ఐపీఎల్​ స్పాట్​ ఫిక్సింగ్​ వివాదంపై బిహార్​ క్రికెట్​ అసోసియేషన్​ సెక్రటరీ ఆదిత్య వర్మ పిటిషన్​ కారణంగా లోథా కమిటీ ఏర్పాటు చేసింది అత్యున్నత న్యాయస్థానం. అయితే తాజాగా మాట్లాడిన వర్మ.. కూలింగ్​ పీరియడ్​ను తొలగించాలన్న దాదా బృందం వినతికి తాము అభ్యంతరం చెప్పమని వెల్లడించారు. గంగూలీ బీసీసీఐను బాగా నడిపించగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా పేర్కొన్నారు. బోర్డు అభివృద్ధి చెందాలంటే దాదా, షా ద్వయం మరింత కాలం కొనసాగాలని ఆకాంక్షించారు వర్మ. అయితే వీరిద్దరి కొనసాగింపుపై సుప్రీం తుది నిర్ణయం తీసుకోనుంది.

ABOUT THE AUTHOR

...view details