తెలంగాణ

telangana

ETV Bharat / sports

పింక్ టెస్టుతో పెద్ద పండగే: గంగూలీ - bangla

శుక్రవారం నుంచి కోల్​కతాలో ప్రారంభంకానున్న డేనైట్ టెస్టు కోసం నగరమంతా గులాబి మయమైంది. ఈ సందర్భంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ట్విట్టర్లో ఫొటోలు షేర్ చేశాడు.

సౌరభ్ గంగూలీ

By

Published : Nov 21, 2019, 10:01 AM IST

చారిత్రక డేనైట్ టెస్టుకు ఇంకొక్క రోజే ఉన్న తరుణంలో సగటు క్రికెట్ అభిమానులతో పాటు బిసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. పింక్ టెస్టు పెద్ద పండగలా జరగబోతోందని ట్విట్టర్లో ఫొటోలు షేర్ చేశాడు.

"క్రీడలకు ఎప్పుడూ మొదటి ప్రాధాన్యమిచ్చే ఈ నగరంలో పింక్ టెస్టు పెద్ద పండగలా జరగబోతుంది. షాహిద్ మినార్ అంతా గులాబి మయంగా మారింది" - గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు.

గతేడాదే పింక్ బంతితో అంతర్జాతీయ మ్యాచ్ ఆడాల్సి ఉన్నప్పటికీ బీసీసీఐ మాత్రం సుముఖత చూపించలేదు. గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడు అయిన తర్వాత డేనైట్ టెస్టుకు రంగం సిద్ధం చేశాడు. శుక్రవారం ఈడెన్ గార్డెన్ వేదికగా బంగ్లాదేశ్​తో తొలిసారి గులాబి టెస్టులో తలపడనుంది కోహ్లీసేన.

ఇదీ చదవండి: ఆఖరి టీ20 టీమిండియాదే.. సిరీస్ క్లీన్ స్వీప్​

ABOUT THE AUTHOR

...view details