తెలంగాణ

telangana

By

Published : Jan 27, 2021, 5:59 PM IST

ETV Bharat / sports

సౌరభ్​ గంగూలీ ఆరోగ్యంపై ఆస్పత్రి క్లారిటీ

కోల్​కతాలోని అపోలో ఆసుపత్రి.. సౌరభ్​ గంగూలీ ఆరోగ్యంపై బులెటిన్​ విడుదల చేసింది. చెకప్​ కోసమే ఆయన ఆసుపత్రికి వచ్చినట్లు పేర్కొంది.

Sourabh Ganguly Health Bulletin released by Apollo Hospital, Kolkata
సౌరభ్​ గంగూలీ హెల్త్​ బులెటిన్ విడుదల

కోల్​కతాలోని అపోలో ఆసుపత్రి వర్గాలు.. సౌరభ్​ గంగూలీ హెల్త్​ బులెటిన్​ను​ విడుదల చేశాయి. గుండెకు సంబంధించిన చెకప్​ కోసమే దాదా ఆసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నాయి. చివరిసారిగా ఆసుపత్రికి వచ్చి వెళ్లినప్పటి నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపాయి. అన్ని అవయవాల పనితీరు బాగుందని స్పష్టం చేశాయి.

అసలేం జరిగింది?

స్వల్ప అస్వస్థతతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ బుధవారం మధ్యాహ్నం మరోసారి ఆసుపత్రిలో చేరారు. కొన్నాళ్ల క్రితమే దాదాకు గుండెనొప్పి రాగా.. పరీక్షించిన వైద్యులు గుండె రక్తనాళాల్లో రెండుచోట్ల పూడికలు వచ్చినట్టు గుర్తించారు. ప్రాథమిక యాంజియోప్లాస్టీ చేశారు. రెండు రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు.

ఇదీ చదవండి:ఒలింపిక్స్​ నిర్వహణ కోసం 'ఐఓసీ' రూల్ బుక్

ABOUT THE AUTHOR

...view details