భారత వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్‌ను ఇతర ఆటగాళ్లతో పోల్చడం మానేయాలని స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నాడు. ముందు ఈ యువ ఆటగాణ్ని నిలదొక్కుకోనివ్వాలని కోరాడు. పంత్ ఆటతీరును పలువురు ఎంఎస్ ధోనీ పోల్చుతున్న క్రమంలో ఈ విధంగా స్పందించారు అశ్విన్. ప్రస్తుతం అతడు వృద్ధమాన్ సాహా నుంచి కీపింగ్‌లో పోటీని ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో రిషభ్.. మరింత బాగా రాణించి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నాడు.
"పంత్ భవిష్యత్తులో మరింత పరిణతి కనబరుస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రేలియాతో సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన పంత్‌ను.. ధోనీతో పోల్చుతున్నారు. ఇప్పుడిప్పుడే అతడు నిలదొక్కుకుంటున్న క్రమంలో పోలికలొద్దు."
- రవిచంద్రన్ అశ్విన్, భారత స్పిన్నర్
చెన్నై టెస్ట్‌లో 5/43తో ఆకట్టుకున్న అశ్విన్.. తన కెరీర్లో 29వ సారి ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలోనే మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్(265)ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి ఎగబాకాడు. ఈ సందర్భంగా భజ్జీకి క్షమాపణలు కోరాడు అశ్విన్.