తెలంగాణ

telangana

ETV Bharat / sports

మాకు ఏదో అయింది: పాక్ కోచ్ మిస్బా

శ్రీలంక చేతిలో 0-3 తేడాతో సిరీస్ చేజార్చుకోవడంపై స్పందించాడు పాకిస్థాన్ ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్. తమ జట్టుకు ఏదో అయిందని, అందుకే అన్ని విభాగాల్లో వైఫల్యం చెందామని అన్నాడు.

మిస్బా ఉల్ హక్

By

Published : Oct 10, 2019, 12:45 PM IST

సొంతగడ్డపై శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్​లో 0-3 తేడాతో ఘోరపరాభావం చెందింది పాకిస్థాన్. ఈ ప్రదర్శనపై ఆ జట్టు ప్రధాన కోచ్ మిస్బా ఉల్ హక్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాక్​​ క్రికెట్ వ్యవస్థకు ఏదో అయిందని, అయితే ఈ సిరీస్ తమ కళ్లు తెరిపించిందని అన్నాడు.

"ఇదే జట్టు మమ్మల్ని అగ్రస్థానం​లో నిలబెట్టింది. కానీఈ సిరీస్ మా కళ్లు తెరిపించింది. ఇప్పుడున్న ఆటగాళ్లు.. మూడు, నాలుగేళ్లుగా జట్టులో ఆడుతున్నారు. పాకిస్థాన్ క్రికెట్ వ్యవస్థకు ఏదో అయింది. ఈ ఓటమితో మేము నెంబర్ వన్ అని ఎలా అనుకోగలం" -మిస్బా ఉల్ హక్​, పాక్ ప్రధాన కోచ్, ఛీఫ్ సెలక్టర్

అయితే ఈ సిరీస్​లో అన్ని విభాగాల్లోనూ పేలవ ప్రదర్శన చేశామని చెప్పాడు కోచ్ మిస్బా.

"ఈ సిరీస్ ఏకపక్షంగా సాగింది. మేం కనీస పోటీ ఇవ్వలేకపోయాం. ప్రతి విభాగంలో విఫలమయ్యాం. శ్రీలంక అద్భుతంగా ఆడింది. అయితే ఈ ఓటమి చాలా నిరుత్సాహపరిచింది. ఇందుకు పూర్తి బాధ్యత నేను తీసుకుంటా" -మిస్బా ఉల్ హక్​, పాక్ ప్రధాన కోచ్, ఛీఫ్ సెలక్టర్

పాకిస్థాన్ కోచ్ అయిన దగ్గరి నుంచి మిస్బాపైనే అందరి దృష్టి సారించారు. ప్రధాన కోచ్​తో పాటు ఆ జట్టు ఛీఫ్​ సెలక్టర్​గానూ మిస్బాకు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్​ క్రికెట్​లోని అత్యున్నత పదవులు రెండూ ఒకే వ్యక్తి ఇవ్వడమేంటని పలువురు ప్రశ్నించారు.

విజయోత్సాహంలో లంక జట్టు

పాకిస్థాన్‌తోబుధవారం జరిగిన మూడో టీ20ను గెలిచి సిరీస్​ను క్లీన్‌స్వీప్‌ (3-0) చేసింది శ్రీలంక. ఒషాడ ఫెర్నాండో (78) చెలరేగి ఆడి లంకను గెలిపించాడు. ఈ మ్యాచ్​లో 13 పరుగుల తేడాతో పాక్‌ ఓడిపోయింది. తొలుత శ్రీలంక 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. ఛేదనలో 6 వికెట్లకు 134 పరుగులే చేయగలిగింది పాకిస్థాన్‌. సొహైల్‌ (52) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

ఇదీ చదవండి: ప్రపంచ ఛాంపియన్​షిప్​ సెమీస్​లో మేరీ కోమ్​

ABOUT THE AUTHOR

...view details