ధోనీ- రైనా వీడ్కోలు: ప్రముఖుల స్పందనలివే..
టీమ్ఇండియా స్టార్ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ, సురేశ్ రైనా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ సందర్భంగా తోటి ఆటగాళ్లు, సినిమా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. "కెరీర్ సాంతం నన్ను ప్రేమించి, మద్దతుగా నిలిచిన మీ అందరికీ ధన్యవాదాలు. 19:29 గంటల నుంచి వీడ్కోలు పలికినట్టుగా భావించండి". అని ఓ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆ వెంటనే "నీ దారిలోనే నడుస్తా’" అంటూ సురేశ్ రైనా రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెట్లరు, ప్రస్తుత క్రికెటర్లు, సినిమా, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ స్పందనలు తెలియజేస్తున్నారు. వాటిలో కొన్ని ఇవీ..