క్రికెట్.. ఇదొక జెంటిల్మెన్ గేమ్. మైదానంలో అడుగుపెట్టాక కచ్చితమైన నిబంధనలు ఉంటాయి. క్రికెటర్లు, అంపైర్లు వాటిని పక్కాగా పాటించాల్సిందే. అయితే 17వ శతాబ్దంలో ప్రారంభమైన టెస్టు క్రికెట్ నుంచి ఇప్పటి వరకు ఈ ఆటలో చాలా మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి. డీఆర్ఎస్ నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన కంకషన్ సబ్‌స్టిట్యూట్ వరకు ఆధునిక కాలంలో వచ్చిన నయా రూల్స్. అయితే కొన్ని నియమాలు మాత్రం భలే వింతగా ఉంటాయి. వాటిల్లో ఓ ఎనిమిది మీ కోసం.. ఓ లుక్కేయండి.
1. మన్కడింగ్:
ప్రపంచ క్రిక్ట్లో బాగా వివాదాస్పదమైన నిబంధనల్లో ఇదీ ఒకటి. భారత బౌలర్ వినూ మన్కడ్ పేరుతోనే ఈ నియమానికి ఆ పేరు పెట్టారు. బౌలర్ బంతి వేసేటప్పడు నాన్-స్టైకర్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్ క్రీజు దాటకూడదు. ఒకవేళ దాటితే బంతి వేయకుండా బౌలర్ బెయిల్స్‌ను పడగొట్టొచ్చు. అప్పుడు ఆ బ్యాట్స్‌మన్ ఔట్ అవుతాడు. దీన్ని రనౌట్లలో ఒక తరహాగా భావిస్తారు. ఈ పద్ధతిలో ఔట్ చేయడాన్ని క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా భావిస్తుంటారు. 2019 ఐపీఎల్లో టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఇలానే చేసి చర్చనీయాంశమయ్యాడు.
2. త్రీ మినిట్ రూల్:
ఈ నిబంధన ప్రకారం బ్యాట్స్‌మన్ ఔటయ్యాక మరో ఆటగాడు మైదానంలోకి వచ్చేందుకు మూడు నిమిషాల వ్యవధి ఇస్తారు. అప్పటిలోగా పిచ్‌లోకి రాకపోతే.. అతడిని రిటైర్డ్ హర్ట్‌గా ప్రకటిస్తారు. హ్యాట్రిక్ వంటి సమయాల్లో మినహా సాధారణంగా ప్రతిసారి ఈ రూల్ పాటించాల్సిందే. అందుకే క్రికెటర్లు మరో బ్యాట్స్‌మన్ ఔట్ కాగానే వేగంగా మైదానంలోకి వస్తారు. ఆ కంగారులో ఒక్కోసారి వేరొకరి బ్యాట్, గ్లోవ్స్ తీసుకొచ్చేయడం చూస్తుంటాం.
3. ద క్యాప్ రూల్ :
ఫీల్డర్ క్యాచ్ పట్టే ముందు క్యాప్‌ను, క్లాత్‌ను బాల్ తాకకూడదు. ఫీల్డర్ చేతులతో మాత్రమే బంతిని ఒడిసి పట్టాలి. లేదంటే బ్యాట్స్‌మన్ ఔట్ అయినా నాటౌట్‌గానే పరిగణిస్తారు.
4. హ్యాండ్లింగ్ ద బాల్: