తెలంగాణ

telangana

ETV Bharat / sports

కివీస్​తో తొలి టీ20లో ఆసీస్​ పరాజయం - న్యూజిలాండ్​ క్రికెట్​ తాజా వార్తలు

న్యూజిలాండ్​, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టీ20లో ఆసీస్ 53 పరుగుల తేడాతో​ పరాజయం పాలైంది. న్యూజిలాండ్​ తరఫున బ్యాటింగ్​లో డేవన్ కాన్వే రాణించగా.. బౌలింగ్​లో ఇష్​ సోథి నాలుగు వికెట్లు తీసి పర్యటక జట్టును దెబ్బకొట్టాడు.

Sodhi and Conway shine as NZ beat Australia by 53 runs in opening T20I
న్యూజిలాండ్​తో తొలి టీ20లో ఆసీస్​ పరాజయం

By

Published : Feb 22, 2021, 4:53 PM IST

Updated : Feb 22, 2021, 5:34 PM IST

న్యూజిలాండ్​ వేదికగా జరిగిన మొదటి టీ20లో ఆస్ట్రేలియా జట్టు ఓటమి పాలైంది. తొలుత బ్యాటింగ్​ చేసిన న్యూజిలాండ్ టీమ్​ నిర్ణీత ఓవర్లలో 184 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. డేవన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్​, జేమ్స్​ నీషమ్​​ రాణించారు. ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు భారీ స్కోరు చేయడంలో కాన్వే కీలక పాత్ర పోషించాడు.

185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్​ జట్టు 131 పరుగులకే కుప్పకూలింది. మిచెల్​ మార్ష్​, ఆస్టన్​ అగర్​ మాత్రమే రాణించారు. 4 వికెట్లు తీసిన ఇష్​ సోథి న్యూజిలాండ్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు. సౌథీ, బౌల్ట్​లు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. 59 బంతుల్లోనే 99 పరుగులు చేసిన కాన్వేను మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్​ వరించింది.

ఐదు టీ20 సిరీస్​లో భాగంగా రెండో మ్యాచ్​ ఫిబ్రవరి 25న డునెడిన్ వేదికగా జరగనుంది.

ఇదీ చదవండి:'ఈ ఏడాది టీ20 వరల్డ్​కప్ మనదే!'

Last Updated : Feb 22, 2021, 5:34 PM IST

ABOUT THE AUTHOR

...view details