దేశంలో పూర్తిస్థాయి మహిళల ఐపీఎల్ నిర్వహించడం వల్ల ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భారత మహిళల క్రికెట్ జట్టు ఓపెనర్ స్మృతి మంధాన అభిప్రాయపడింది. దానికి సంబంధించి బీసీసీఐ ప్రణాళికలు రచిస్తుందని తెలిపింది.
'పూర్తిస్థాయిలో మహిళల ఐపీఎల్ నిర్వహించాలి'
మహిళల ఐపీఎల్ నిర్వహించడం వల్ల అత్యుత్తమ ఆటగాళ్లను గుర్తించవచ్చని అంటోంది టీమ్ఇండియా మహిళా క్రికెటర్ స్మృతి మంధాన. ఇలాంటి టోర్నీ ప్రపంచకప్‌లో జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
"మహిళల ఐపీఎల్ దిశగా బీసీసీఐ గొప్ప ప్రయత్నాలే చేస్తోంది. రెండేళ్ల క్రితం తొలిసారి ఎగ్జిబిషన్ మ్యాచ్‌ల తరహాలో అమ్మాయిల ఐపీఎల్ నిర్వహించారు. గతేడాది మూడు జట్లతో లీగ్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది నాలుగు జట్లతో నిర్వహించాలని అనుకున్నారు. ఏడాది లేదా రెండేళ్లలో ఐపీఎల్ తరహాలో అమ్మాయిల మ్యాచ్‌లు ఎక్కువగా జరుగుతాయి. అయిదారు జట్లతో ఐపీఎల్ నిర్వహిస్తే భారత మహిళల క్రికెట్‌కు ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచకప్‌ల్లో జట్టు ప్రదర్శనపై అది ప్రభావం చూపనుంది" అని మంధాన తెలిపింది.
ఇదీ చూడండి..'బ్యాచ్‌లర్' దసరాకు రాబోతున్నాడా!