తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఐసీసీ ర్యాంకింగ్స్​: స్మృతి పైపైకి.. పడిపోయిన రోడ్రిగ్స్​ - Jemimah Rodrigues dropped to seventh

మహిళా టీ20 ర్యాంకింగ్స్​ను విడుదల చేసింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. బ్యాట్స్​మెన్ విభాగంలో టీమిండియా క్రికెటర్ స్మృతి మంధాన నాలుగో ర్యాంక్​కు చేరుకుంది.

మంధాన
మంధాన

By

Published : Feb 14, 2020, 4:44 PM IST

Updated : Mar 1, 2020, 8:22 AM IST

ఐసీసీ విడుదల చేసిన మహిళా టీ20 ర్యాంకింగ్స్​లో టీమిండియా క్రికెటర్ స్మృతి మంధాన (732 పాయింట్లు) ర్యాంకును మెరుగుపర్చుకుంది. మూడు స్థానాలు ఎగబాకి నాలుగో ర్యాంకుకు చేరుకుంది. మరో క్రీడాకారిణి రోడ్రిగ్స్ (663 పాయింట్లు) ఏడో స్థానానికి పడిపోయింది. హర్మన్​ప్రీత్ కౌర్ తొమ్మిదో స్థానంలోనే కొనసాగుతోంది. న్యూజిలాండ్ ప్లేయర్ సుజీ బేట్స్ (765 పాయిట్లు) అగ్రస్థానంలో నిలిచింది.

బౌలర్ల విభాగంలో పూనమ్ యాదవ్ (647 పాయింట్లు) ఆరు స్థానాలు పడిపోయి 12వ ర్యాంకుకు చేరుకుంది. రాధా యాదవ్, దీప్తి శర్మ సమానంగా 726 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచారు. ఆస్ట్రేలియాకు చెందిన మెగన్ షట్ 746 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది.

ఆల్​రౌండర్ విభాగంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఎలిస్ పెర్రీ నెంబర్​ వన్​గా కొనసాగుతోంది. ఈ లిస్టులో టాప్​-10లో ఒక్క భారతీయ క్రీడాకారిణి లేదు. దీప్తి శర్మ 16వ ర్యాంకే ఉత్తమం.

Last Updated : Mar 1, 2020, 8:22 AM IST

ABOUT THE AUTHOR

...view details