తెలంగాణ

telangana

By

Published : Nov 7, 2019, 2:27 PM IST

ETV Bharat / sports

విరాట్ కోహ్లీని అధిగమించిన స్మృతి మంధాన

వన్డేల్లో వేగంగా 2 వేల పరుగులు పూర్తి చేసిన మూడో క్రికెటర్​గా స్మృతి మంధాన రికార్డు సృష్టించింది. 51 ఇన్నింగ్స్​ల్లో 2,025 పరుగులు చేసి.. టీమిండియా కెప్టెన్ విరాట్​ కోహ్లీ(53)ని అధిగమించింది.

విరాట్ కోహ్లీని అధిగమించిన స్మృతి మంధాన

వెస్టిండీస్​ మహిళా జట్టుతో జరిగిన వన్డే సిరీస్​లో భారత్ 2-1 తేడాతో నెగ్గింది. ఈ సిరీస్​లో టీమిండియా స్టార్ బ్యాట్స్​ఉమన్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించింది. వన్డేల్లో వేగంగా 2వేల పరుగులు పూర్తి చేసిన మూడో క్రికెటర్​గా రికార్డు సృష్టించింది. 51 ఇన్నింగ్స్​ల్లో 2,025 పరుగులు చేసి.. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్​గానూ గుర్తింపు తెచ్చుకుంది.శిఖర్ ​ధావన్(48) స్మృతి కంటే ముందున్నాడు.

మహిళా క్రికెట్లో ఆస్ట్రేలియా బ్యాట్స్​ఉమెన్ బెలిండా క్లార్క్(45), మెగ్ లానింగ్(45) ముందు వరుసలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే దక్షిణాఫ్రికా ఆటగాడు హషీమ్ ఆమ్లా 40 ఇన్నింగ్స్​ల్లో 2వేల పరుగులు పూర్తి చేసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

స్మృతి మంధాన

విరాట్​ కంటే వేగంగా..

51 ఇన్నింగ్స్​ల్లో 43.05 సగటుతో 2,025 పరుగులు చేసింది స్మృతి. ఈ రికార్డుతో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(53), సౌరభ్ గంగూలీ(52), నవజ్యోత్ సిద్ధు(52)లను అధిగమించింది.

ఆంటిగ్వా వేదికగా విండీస్​తో జరిగిన మూడో వన్డేలో స్మృతి అర్ధశతకంతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. 63 బంతుల్లో 74 పరుగులు చేసింది. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా 194 పరుగుల లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది భారత మహిళా జట్టు.

ఇదీ చదవండి: ఆఖరి వన్డే టీమిండియాదే.. సిరీస్​ కైవసం

ABOUT THE AUTHOR

...view details