తెలంగాణ

telangana

ETV Bharat / sports

యాషెస్​: ఆసీస్​కు షాక్​... మూడో టెస్టుకు స్మిత్​ దూరం - స్టీవ్​ స్మిత్​కు గాయం

ప్రతిష్ఠాత్మక యాషెస్​​లో ఆస్ట్రేలియా జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్​ బ్యాట్స్​మెన్​ స్టీవ్​ స్మిత్ గాయం కారణంగా​ మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఆసీస్​ క్రికెట్​ బోర్డు మంగళవారం ప్రకటించింది.

యాషెస్​లో ఆసీస్​కు పెద్ద దెబ్బ... మూడో టెస్టుకు స్మిత్​ దూరం

By

Published : Aug 21, 2019, 5:51 AM IST

Updated : Sep 27, 2019, 5:47 PM IST

యాషెస్‌లో భాగంగా ఇం‍గ్లాండ్‌తో మూడో పోరుకు సిద్ధమవుతోన్న ఆసీస్​ జట్టుకు షాక్​ తగిలింది. ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమైనట్లు...క్రికెట్​ఆస్ట్రేలియా వెల్లడించింది.

" హెడింగ్లే వేదికగా జరగనున్న యాషెస్​ మూడో టెస్టుకు స్టీవ్​ స్మిత్​ దూరమయ్యాడు. గాయం వల్ల మంగళవారం జరిగిన ట్రైనింగ్​ సెషన్​లోనూ అతడు​ పాల్గొనలేకపోయాడు. కోచ్​ జస్టిన్​ లాంగర్​ సూచన మేరకు స్మిత్​కు మరింత విశ్రాంతినివ్వాలని భావిస్తున్నాం".
-- క్రికెట్​ ఆస్ట్రేలియా ట్వీట్​

మొదటి టెస్టులో రెండు ఇన్నింగ్స్​ల్లోనూ రెండు శతకాలు చేశాడీ స్మిత్​​. రెండో టెస్టులో 92 పరుగులతో రాణించాడు. స్మిత్‌ స్థానంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన లబషేన్‌ మూడో టెస్టులోనూ బరిలోకి దిగనున్నాడు. ఇరుజట్ల మధ్య మ్యాచ్​ గురువారం నుంచి ప్రారంభం కానుంది.

లార్డ్స్‌ వేదికగా జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో... ఇంగ్లాండ్‌ పేసర్​ జోఫ్రా ఆర్చర్‌ రాకాసి బంతికి స్మిత్‌ గాయపడ్డాడు. నొప్పితో విలవిల్లాడుతూ మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటింగ్‌కు దిగలేదు. తొలి రెండు టెస్టుల్లో ఆసీస్‌ బ్యాటింగ్‌కు వెన్నెముకగా నిలిచిన స్మిత్‌.. తర్వాతి టెస్టుకు ఆడకపోవడం ఆ జట్టుపై బాగా ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇదీ చదవండి...తల్లులు కాబోతున్న మహిళా క్రికెట్ జంట

Last Updated : Sep 27, 2019, 5:47 PM IST

ABOUT THE AUTHOR

...view details