తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఈ మిలీనియంలో ఒకే ఒక్కడు.. స్టీవ్ స్మిత్! - england

యాషెస్ సిరీస్​ డ్రాగా ముగిసింది. 774 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్ ఒకే సిరీస్​లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఈ మిలీనియంలో ఓ టెస్టు సిరీస్​లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు.

స్టీవ్ స్మిత్

By

Published : Sep 16, 2019, 8:01 AM IST

Updated : Sep 30, 2019, 6:58 PM IST

ఈ మిలీనియంలో(2000 సంవత్సరం తర్వాత) ఓ టెస్టు సిరీస్​లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్​గా స్టీవ్ స్మిత్ రికార్డు సృష్టించాడు. 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు స్మిత్. భారత్​పై 2014-15 సీజన్​లో తాను చేసిన 769 పరుగుల రికార్డును తానే తిరగరాశాడు.

స్టీవ్ స్మిత్

ఏడు ఇన్నింగ్స్​లోనే ఈ ఘనత అందుకున్నాడు స్మిత్. ఇందులో మూడు శతకాలు(144, 142, 211), మూడు అర్ధశతకాలు(92,82,80) ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఓ యాషెస్​లో ఎక్కువ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్మిత్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఆఖరి ఇన్నింగ్స్​లో తప్ప ప్రతి ఇన్నింగ్స్​లోనూ కనీసం 50 పరుగులు చేశాడు స్మిత్.

అవమానించిన చోటే.. అభినందనలు..

బాల్ టాంపరింగ్​ కారణంగా ఏడాది పాటు నిషేధం ఎదుర్కొన్న స్టీవ్ స్మిత్ యాషెస్ సిరీస్​లో పునరాగమనం చేశాడు. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ప్రపంచకప్​, యాషెస్ సిరీస్​లో స్మిత్ బ్యాటింగ్​కు దిగుతున్నపుడు చీటర్ అంటూ ఇంగ్లీష్ అభిమానులు ఎగతాళి చేసినా పట్టించుకోలేదు స్మిత్​. ఇప్పుడు అందరి గౌరవం అందుకున్నాడు. ఆఖరి టెస్టు చివరి ఇన్నింగ్స్​లో అతడు ఔటై వెళ్లి పోతుంటే అందరూ లేచి చప్పట్లు కొట్టి అభినందించారు.

యాషెస్ సిరీస్​​లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు..

  1. 1930లో సర్​ డాన్​బ్రాడ్​మన్​(ఆస్ట్రేలియా)​ 974 పరుగుల చేసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇందులో 4 శతకాలు ఉన్నాయి. అత్యధిక వ్యక్తిగత స్కోరు 334.
  2. 1928-29 సీజన్​లో వాల్లీ హమ్మాండ్(ఇంగ్లాండ్) 905 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 251.
  3. 1989లో మార్క్ టేలర్(ఆస్ట్రేలియా) 839 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 219
  4. 1936/37 సీజన్​లో 810 పరుగలు చేసి నాలుగోస్థానంలో ఉన్నాడు బ్రాడ్​మన్. ఇందులో 3 సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 270.
  5. ప్రస్తుతం ఈ సీజన్​లో స్టీవ్ స్మిత్(ఆసీస్) 110.57 సగటుతో 774 పరుగులు చేశాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 211.
  6. 2010/11 సీజన్​లో అలెస్టర్​ కుక్ 766 పరుగుల చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 235.

ప్రస్తుతం జరిగిన యాషెస్ సిరీస్​ చివరి టెస్టులో 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 263 పరుగులకే కుప్పకూలింది. 2-2 తేడాతో సిరీస్​ డ్రాగా ముగిసింది. గత సీజన్ విజేతగా నిలిచిన ఆస్ట్రేలియానే యాషెస్ టైటిల్​ను కాపాడుకుంది.

ఇదీ చదవండి: 'నీ మద్దతు​కు ధన్యవాదాలు.. ఐ లవ్ యూ'​

Last Updated : Sep 30, 2019, 6:58 PM IST

ABOUT THE AUTHOR

...view details