టీమిండియాతో బెంగళూరులో జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్నాడు ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్. 131 పరుగులు చేసి, కంగారూ జట్టు 286 పరుగులు చేయడంలో కీలక పాత్ర వహించాడు. అయితే వన్డేల్లో ఈ శతకం కోసం స్మిత్.. దాదాపు మూడేళ్లు నిరీక్షించాల్సి వచ్చింది.
స్టీవ్ స్మిత్.. ఓ వన్డే సెంచరీ.. మూడేళ్ల నిరీక్షణ
ఆసీస్ స్టార్ బ్యాట్స్‌మన్ స్మిత్.. భారత్‌తో మూడో వన్డేలో శతకం చేశాడు. అయితే ఈ సెంచరీలో ఓ విశేషముంది. అదేంటంటే?
స్టీవ్ స్మిత్
2017 జనవరి 19న, తన వన్డే కెరీర్లో 8వ సెంచరీ చేసిన స్మిత్.. సరిగ్గా అదే రోజున మూడేళ్ల తర్వాత శతకం చేశాడు. దీని కోసం ఇన్నేళ్ల పాటు ఎదురుచూడాల్సి వచ్చింది.
ఈ మ్యాచ్‌లోని ఆసీస్ ఇన్నింగ్స్‌లో యువ బ్యాట్స్‌మన్ లబుషేన్‌తో మూడో వికెట్‌కు 126 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు స్మిత్. ఈ క్రమంలోనే వన్డేల్లో 4000 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కేవలం 121 వన్డేల్లో ఈ ఘనత అందుకోవడం విశేషం.
Last Updated : Jan 19, 2020, 11:24 PM IST