తెలంగాణ

telangana

ETV Bharat / sports

గాయంతో స్మిత్​ ఔట్​.. తొలిసారి కాంకషన్​​కు అవకాశం - ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు

యాషెస్ రెండో టెస్టు మ్యాచ్​లో ఆర్చర్‌ వేసిన బంతికి గాయపడిన ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌ స్మిత్‌... ఇంగ్లాండ్​ రెండో ఇన్నింగ్స్​లో మైదానంలో అడుగుపెట్టలేదు. మెడకు బంతి బలంగా తాకడం వల్ల అతడికి కాస్త విశ్రాంతి సూచించారు వైద్యులు. అతడి స్థానంలో అంపైర్లు కాంకషన్​ సబ్​స్టిట్యూట్​గా లాబస్​చేంజ్​ను అనుమతించారు.

స్మిత్​ దూరం... కాంకషన్​ సబ్​స్టిట్యూట్​కు అవకాశం

By

Published : Aug 18, 2019, 9:37 PM IST

Updated : Sep 27, 2019, 10:53 AM IST

యాషెస్​ రెండో టెస్ట్​ నాలుగో రోజు ఇంగ్లాండ్​ బౌలర్​ ఆర్చర్‌ వేసిన బంతికి తీవ్రంగా గాయపడ్డాడు ఆసీస్‌ ఆటగాడు స్టీవ్‌స్మిత్‌. ఫలితంగా రెండో ఇన్నింగ్స్​లో బరిలోకి దిగలేదు. అతడి స్థానంలో కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆల్‌రౌండర్‌ లాబస్‌చేంజ్‌ మైదానంలో అడుగుపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌ చరిత్రలో తొలి కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా లాబస్‌చేంజ్‌ పేరు రికార్డుకెక్కింది.

"గాయంతో బాధపడుతున్న స్టీవ్​ స్మిత్‌ మ్యాచ్‌ నుంచి తప్పుకున్నాడు. జట్టు వైద్య ప్రతినిధి రిచర్డ్స్ అంగీకారంతో స్మిత్​ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఐసీసీ కాంకషన్ సబ్‌స్టిట్యూట్‌ చట్టం ప్రకారం మ్యాచ్ రిఫరీకి దరఖాస్తు చేశాం."
-- ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు.

ఆసీస్​ క్రికెట్​ బోర్డు దరఖాస్తును పరిశీలించిన అంపైర్లు... కాంకషన్​ సబ్​స్టిట్యూట్​కు అవకాశమిచ్చారు. ఫలితంగా ఇన్నెళ్ల క్రికెట్​ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 'లాబస్‌చేంజ్‌' తొలి కాంకషన్​ ఆటగాడయ్యాడని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ట్వీట్ చేసింది.

ఆడలేని స్థితిలో మరొకరికి....

ఒక క్రికెటర్‌ తల, మెడకు గాయమై.. ఆడలేని స్థితిలో రిటైర్డ్‌హర్ట్‌ అయితే అప్పుడు సబ్‌స్టిట్యూట్‌కు బ్యాటింగ్‌, బౌలింగ్‌ కూడా చేసే అవకాశం కల్పిస్తారు. తాజాగా ఈ విధానానికి మార్గం సుగమం చేసింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ఐసీసీ). ఆటగాళ్ల భర్తీ నిర్ణయం జట్టు వైద్య ప్రతినిధి తీసుకుంటారు. మ్యాచ్‌ రిఫరీ దీనికి ఆమోదం తెలుపుతారు. ఈ కొత్త విధానాన్ని యాషెస్‌ సిరీస్‌ నుంచి అధికారికంగా అమల్లోకి తీసుకువచ్చింది ఐసీసీ.

Last Updated : Sep 27, 2019, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details