తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా దరిచేరకుండా ముంబయి మాస్టర్​ ప్లాన్​!

ఐపీఎల్​లో ఆటగాళ్లు, సిబ్బంది కరోనా బారిన పడకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినప్పటికీ కొంత మందిలో భయాలు మాత్రం వీడట్లేదు. అయితే, కరోనా నుంచి మరింత సురక్షితంగా ఉండేందుకు ముంబయి జట్టు సరికొత్త పద్దతిని తీసుకొచ్చింది. ప్రతి ఆటగాడు వ్యక్తిగత ఆరోగ్య ట్రాకింగ్​ పరికరాన్ని ధరించేలా ఏర్పాట్లు చేసింది. అసలు ఇది ఎలా పనిచేస్తుంది. దీన్ని ధరిస్తే కరోనా దరిచేరదా? తెలుసుకుందాం రండి.

Smart Ring
ఐపీఎల్

By

Published : Sep 5, 2020, 9:21 PM IST

Updated : Sep 6, 2020, 6:10 AM IST

ఈ ఏడాది ఐపీఎల్​ ఎప్పుడూ లేనంత భిన్నంగా జరగనుంది. కరోనా కారణంగా సీజన్ మొత్తం​ యూఏఈలో నిర్వహించనున్నారు. ఈ విధంగా జరగడం ఇదే తొలిసారి. మరోవైపు దుబాయ్​ చేరుకున్న ఆటగాళ్లంతా బయో బబుల్​లో ఉన్నారు. క్రమం తప్పకుండా వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆటగాళ్లు సురక్షితంగా ఉండేందుకు బీసీసీఐ అన్ని చర్యలు తీసుకుంటోంది. అయితే, ముంబయి ఇండియన్స్​ జట్టు క్రికెటర్ల రక్షణ కోసం మరో స్మార్ట్​ పద్దతిని ప్రవేశపెట్టింది. జట్టులోని ప్రతి ఆటగాడు వ్యక్తిగత ఆరోగ్య ట్రాకింగ్​ పరికరాన్ని ధరించేలా ఏర్పాట్లు చేసింది. ముంబయి జట్టు సభ్యులు ఈ పరికరాలను ధరించిన ఫొటోలను ఫ్రాంచైజీ ట్విట్టర్​లో పంచుకుంది.

పీపీఈ కిట్ల ధిరంచిన రోహిత్​ దంపతులు

ఇప్పటికే బీసీసీఐ ఆటగాళ్లకు బ్లూటూత్​- ఎనేబుల్​డ్​ కాంటాక్ట్​ ట్రేసింగ్​ పరికరాన్ని అందజేసింది. రోజూవారి ఫిట్​నెస్​ను దీని ద్వారా తెలుసుకోనుంది. అయితే, ముంబయి జట్టు స్మార్ట్​ పద్దతితో వారి రక్షణకు మరింత బలం చేకూరినట్లైంది. కరోనా వ్యాప్తిని తగ్గించడంలో ఇది ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది.

బయో బబుల్​

"ఈ పరికరం మన హృదయ స్పందన, శ్వాస, శరీర ఉష్టోగ్రత తదితర వివరాలను పర్యవేక్షిస్తుంది. ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే ముందుగానే పసిగడుతుంది. తద్వారా లక్షణాలు లేని​ కేసులను ముందుగానే గుర్తించి పరిష్కరించవచ్చు. నేషనల్​ బాస్కెట్​బాల్​ అసోసియేషన్​ ఇలాంటి పరికరాన్నే ఉపయోగించింది."

-ఐపీఎల్ అధికారిక వర్గాలు

"మాతో పాటు మా కుటుంబం కూడా ఇక్కడికి వచ్చింది. ముంబయి ఇండియన్స్ క్యాంప్​ అంటే సురక్షితమైన ప్రదేశంగా కనిపించాలి. ఆటగాళ్లు, సిబ్బంది ఆరోగ్య భద్రత కోసం ముంబయి జట్టు ఎంత పెట్టుబడి పెట్టిందో ఇదే నిదర్శనం" అని ఆటగాడు పేర్కొన్నాడు.

పీపీఈ కిట్లతో ఆటగాళ్లు

మరోవైపు క్రీడాకారులు, కుటుంబం, సిబ్బంది వినోదం కోసం ముంబయి ఇండియన్స్ 15 వేల చదరపు అడుగుల గదిని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా, 10వేల చదరపు అడుగుల వ్యాయామశాలను కూడా రూపొందించింది.

పీపీఈ కిట్లు దరించిన క్రికెటర్​ దంపతులు
Last Updated : Sep 6, 2020, 6:10 AM IST

ABOUT THE AUTHOR

...view details