గురువారం జరిగిన ఐపీఎల్ వేలంలో భారత సీనియర్ బ్యాట్స్‌మన్ యూసఫ్ పఠాన్‌కు నిరాశే ఎదురైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ అతడిని వదులుకోగా.. రూ.కోటి కనీస ధరతో అతడు వేలంలో ఉన్నాడు. అయితే ఏ జట్టు యూసఫ్‌ను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్, యూసఫ్ తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. నువ్వే నిజమైన విన్నర్‌వని అన్నాడు.
"తాత్కాలిక ఇబ్బందులేవీ.. నీ కెరీర్‌ను ప్రభావితం చేయలేవు. నీ అత్యుత్తమ ఆటతీరును ఎప్పటికీ మరిచిపోలేం. నిరంతరం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నువ్వే నిజమైన మ్యాచ్ విన్నర్‌వి" -ఇర్ఫాన్ పఠాన్, భారత క్రికెటర్