తెలంగాణ

telangana

ETV Bharat / sports

'టీమ్​ఇండియా వికెట్​ కీపర్​గా పంత్​ సరైనోడు' - ధోనీ పంత్​

ధోనీ రిటైర్మెంట్ తర్వాత అతడి స్థానంలో యువఆటగాడు పంత్​ జట్టులో సరైన వ్యక్తి అని అభిప్రాయపడ్డాడు టీమ్​ఇండియా బ్యాటింగ్​ కోచ్​ సంజయ్​ బంగర్​. జట్టులో రైట్​హ్యాండ్​ బ్యాట్స్​మెన్​తో సమానంగా లెఫ్ట్​హ్యాండ్​ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని సూచించాడు. ఇతడి వ్యాఖ్యలను టీమ్​ఇండియా మాజీ పేసర్​ ఆశిష్​ నెహ్రా సమర్థించాడు.

Sanjay Bangar bats for Rishabh Pant to replace MS Dhoni
'టీమ్​ఇండియా వికెట్​ కీపర్​గా పంత్​ సరైనోడు'

By

Published : Oct 8, 2020, 4:49 PM IST

అంతర్జాతీయ క్రికెట్​కు టీమ్​ఇండియా మాజీ సారథి​ ధోనీ రిటైర్మెంట్​ ప్రకటించిన తర్వాత అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారని ప్రస్తుతం చర్చ నడుస్తోంది. ఈ క్రమంలోనే మహీ స్థానంలో రిషభ్​ పంత్​ను ఎంపిక చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన బ్యాటింగ్​ కోచ్​ సంజయ్​ బంగర్.. వికెట్​కీపర్​గా పంత్​ సరైన ఎంపిక అని అభిప్రాయపడ్డాడు.

"వికెట్​ కీపర్​గా పంత్​ సరైన ఎంపిక అని నేను భావిస్తున్నా. ప్రస్తుత ఐపీఎల్​లో తన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. దీంతో పాటు జట్టులో ఎడమచేతి వాటం బ్యాట్స్​మన్​ ఉండటం ముఖ్యమని నేను అనుకుంటున్నా. మిడిల్​ ఆర్డర్​లో టీమ్​ఇండియాకు ఎక్కువ మంది కుడిచేతి వాటం​ బ్యాట్స్​మెన్​ ఉండటం వల్ల పంత్​ రాకతో బ్యాటింగ్​ లైనప్​ సమతుల్యం​ అవుతుంది".

- సంజయ్​ బంగర్​, టీమ్​ఇండియా బ్యాటింగ్​ కోచ్​

సంజయ్​ అన్న వ్యాఖ్యలను మాజీ పేసర్​ ఆశిష్​ నెహ్రా సమర్థించాడు. "నేను సంజయ్​ బంగర్​ చెప్పినదానికి అంగీకరిస్తున్నా. జట్టులో పంత్​కు స్థానం కల్పిస్తారని భావిస్తున్నా. అంతర్జాతీయ క్రికెట్​ విషయానికి వస్తే యువక్రీడాకారులకు మద్దతు అవసరం" అని నెహ్రా అభిప్రాయపడ్డాడు.

ABOUT THE AUTHOR

...view details