మ్యాచ్ జరుగుతున్నప్పుడు తనను స్లెడ్జింగ్ చేసినా పెద్దగా పట్టించుకోనని భారత్ నయా వాల్ ఛతేశ్వర్ పుజారా అన్నాడు. స్లెడ్జింగ్ చేసినంత మాత్రాన ప్రత్యర్థి జట్టు ప్రతి మ్యాచ్ గెలవదని అభిప్రాయపడ్డాడు. మైదానంలో ఉన్నంత సేపు తన ధ్యాస బంతిపైనే ఉంటుందని, ఇతర ఆటగాళ్లు ఏమన్నా పట్టించుకోనని తెలిపాడు.
స్లెడ్జింగ్ చేస్తూ ప్రతి మ్యాచ్ గెలవలేరు: పుజారా
ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో స్లెడ్జింగ్ గురించి పుజారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈనెల 17న అడిలైడ్ వేదికగా భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. డే/నైట్ పద్ధతిలో ఈ పోరు జరగనుంది.
'స్లెడ్జింగ్ చేస్తూ ప్రతీ మ్యాచ్ గెలవలేరు'
పుజారాకు ఎదురైన స్లెడ్జింగ్ అనుభవాలు
- 2018-19 భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా 1000 బంతులు ఆడాడు. ఈ పర్యటనలోని ఓ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బౌలర్ లైయన్ పుజారాను ఉద్దేశిస్తూ 'అసలు నీకు బ్యాటింగ్ అంటే బోర్ కొట్టదా?' అని విసుక్కున్నాడు.
- 2017లో రాంచీలో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో పుజారా 202 పరుగులు చేశాడు. అప్పుడు తన దగ్గరకు వచ్చిన ఆసీస్ ఆటగాళ్లు.. 'ఇప్పుడు నువ్వు ఔట్ కాకపోతే, మేం వీల్ ఛైర్స్ అడుగుతాం' అని ఎగతాళి చేశారు.
- 2018-19 ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఓ ఇంటర్యూలో మాట్లాడిన ఆసీస్ బౌలర్ జోష్ హేజిల్‌వుడ్... టీమ్ఇండియా కెప్టెన్‌పై ఒత్తిడి తెచ్చేలా మాట్లాడాడు. తమకు విరాట్ కన్నా పుజారాను ఔట్ చేయడమే చాలా ముఖ్యమని అన్నాడు. అయితే ఆ సిరీస్‌లో 1135 బంతులు ఆడిన పుజారా.. మొత్తంగా 521 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా గడ్డపై భారత్ సిరీస్ గెలవడం కూడా అదే మొదటిసారి కావడం విశేషం.
ఇదీ చదవండి:స్మిత్‌కు కెప్టెన్సీ?.. గిల్‌క్రిస్ట్ ఆసక్తికర వ్యాఖ్యలు