తెలంగాణ

telangana

ETV Bharat / sports

అలా చేస్తే కోహ్లీ మరింతగా రెచ్చిపోతాడు: స్టీవ్ వా - స్టీవ్​ వా తాజా

కెప్టెన్ కోహ్లీని ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ స్లెడ్జింగ్​ చేయొద్దని ఆసీస్ ఆటగాళ్లకు సూచించాడు మాజీ క్రికెటర్ స్టీవ్ వా. అలా చేస్తే మరింతగా రెచ్చిపోతాడని అభిప్రాయపడ్డాడు.

Sledging is not going to worry Virat Kohli: Steve Waugh warns Aussies
'అలా చేశారంటే కోహ్లీ ఈసారి మరింతగా రెచ్చిపోతాడు'

By

Published : Nov 6, 2020, 12:32 PM IST

Updated : Nov 6, 2020, 1:59 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీపై స్లెడ్జింగ్(దూషణ)​ చేయొద్దని తమ దేశ ఆటగాళ్లకు మాజీ క్రికెటర్ స్టీవ్ వా సూచించాడు. అలా చేస్తే విరాట్ మరిన్ని పరుగులను చేసే అవకాశముందని హెచ్చరించాడు. తనను తాను నియంత్రించకోవడంలో కోహ్లీ చాలా మెరుగయ్యాడని అభిప్రాయపడ్డాడు.

"స్లెడ్జింగ్​ కోహ్లీని ఏం చేయలేదు. అతడిలాంటి గొప్ప ఆటగాళ్లపై ఇది​ ఏ మాత్రం ప్రభావం చూపదు. అతడిని వదిలేయడమే ఉత్తమం. లేదంటే అది మరింత స్ఫూర్తిదాయకంగా మారుతుంది. తనను తాను నియంత్రించుకోవడంలో విరాట్ చాలా మెరుగయ్యాడు. గత సిరీస్​లో స్మిత్​ 300 పరుగుల్ని సాధించాడు. దాన్ని మనసులో పెట్టుకున్న కోహ్లీ.. ఈ సారి మరింత రెచ్చిపోయి ఆడే అవకాశముంది"

-- ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, స్టీవ్​ వా

గత ఆస్ట్రేలియా పర్యటనలో కెప్టెన్ టిమ్​ పెయిన్​, ఇతర ఆటగాళ్లు.. కోహ్లీపై స్లెడ్జింగ్​ చేశారన్న ఆరోపణలను ఎదుర్కొన్నారు. 2016 నుంచి వరుసగా ఆస్ట్రేలియా సిరీస్​ను భారత్​ కైవసం చేసుకుంది.

యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్​ పూర్తయిన తర్వాత టీమ్​ఇండియా.. నేరుగా ఆస్ట్రేలియాకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భాగంగా టెస్టు, వన్డే, టీ20​లు ఆడనుంది. నవంబర్​ 27 నుంచి జనవరి 19 వరకు ఈ మ్యాచ్​లు జరగనున్నాయి.

ఇదీ చూడండి:ఆసీస్​'తో పోలిస్తే భారత క్రికెటర్లకు విశ్రాంతి తక్కువే!

Last Updated : Nov 6, 2020, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details