తెలంగాణ

telangana

ETV Bharat / sports

శ్రీలంక క్రికెట్ బోర్డు డైరెక్టర్​గా టామ్​ మూడీ - శ్రీలంక క్రికెట్ బోర్డు

శ్రీలంక క్రికెట్ బోర్డు డైరెక్టర్​గా ఆసీస్ మాజీ​ క్రికెటర్​ టామ్​ మూడీ నియామకమయ్యాడు. 2021 మార్చి 1 నుంచి ఆయన ఈ పదవిలో కొనసాగనున్నాడు. గతంలో లంక జట్టుకు కోచ్​గా పని చేశాడు మూడీ.

SLC appoint Tom Moody as Director of Cricket
శ్రీలంక క్రికెట్ బోర్డు డైరెక్టర్​గా టామ్​ మూడీ

By

Published : Feb 28, 2021, 7:02 PM IST

శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్​ఎల్​సీ) నూతన డైరెక్టర్​గా ఆస్ట్రేలియా మాజీ ఆల్​రౌండర్​ టామ్​ మూడీ నియామకమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్​ఎల్​సీ ధ్రువీకరించింది.

లంక క్రికెట్​ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి నియమించిన సాంకేతిక సలహా కమిటీ సూచన మేరకు మూడీ నియామకం జరిగింది.

'2021 మార్చి 1 నుంచి శ్రీలంక క్రికెట్ బోర్డు డైరెక్టర్​గా టామ్ మూడీని నియమిస్తున్నట్లు ప్రకటిస్తున్నాం. దేశంలో క్రికెట్ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి నియమించిన సాంకేతిక సలహా కమిటీ సూచన మేరకు అతని నియామకం జరిగింది.' అని ఎస్​ఎల్​సీ ట్విట్టర్​లో పేర్కొంది.

గతంలో లంక జట్టుకు కోచ్​గా రెండేళ్లు పనిచేశాడు మూడీ. ఆయన కాలంలోనే శ్రీలంక జట్టు 2007 ప్రపంచ కప్​ ఫైనల్​కు చేరుకుంది. దీంతోపాటు ఐపీఎల్​ జట్టు సన్​రైజర్స్​కు కోచ్​గా పనిచేశాడు. ప్రస్తుత సీజన్​కు సన్​రైజర్స్​ జట్టు డైరెక్టర్​గానూ వ్యవహరిస్తున్నాడు.

ఇదీ చదవండి:రెజ్లింగ్ పోటీల్లో 'బంగారం'తో మెరిసిన వినేశ్ ఫొగాట్​

ABOUT THE AUTHOR

...view details