శ్రీలంకతో టెస్టు సమరానికి ముందు.. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా కలవరం మొదలైంది. ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కొవిడ్ బారిన పడ్డాడు. హంబట్టా విమానాశ్రయానికి ఇంగ్లాండ్ జట్టు చేరుకున్న అనంతరం నిర్వహించిన పరీక్షల్లో అలీకి పాజిటివ్‌గా నిర్ధరణ అయినట్లు ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు తెలిపింది. అయితే.. జట్టులోని మిగతా సభ్యులందరికీ నెగెటివ్ రాగా.. అలీ ఒక్కడికే పాజిటివ్‌గా తేలడం గమనార్హం.
శ్రీలంకతో టెస్టు.. ఇంగ్లాండ్ జట్టులో కరోనా కలవరం! - ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో కరోనా
టెస్టు సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఇంగ్లాండ్ క్రికెట్ జట్టును కొవిడ్ మహమ్మారి ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆదివారం నిర్వహించిన పరీక్షల్లో ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీకి.. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
శ్రీలంక ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొయిన్ అలీ.. 10 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నాడు. అతడితో సన్నిహితంగా మెదిలిన మరో ఆటగాడు క్రిస్ వోక్స్ కూడా స్వీయ నిర్బంధంలో ఉన్నాడు. జో రూట్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు.. శ్రీలంకకు ఆదివారం చేరుకుంది. జనవరి 14 నుంచి శ్రీలంక, ఇంగ్లాండ్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో.. మంగళవారం ఇంగ్లాండ్ జట్టుకు మరోసారి ఆర్టీ- పీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇదీ చూడండి:సిడ్నీ టెస్టులో భారత్‌దే పైచేయి: రోహిత్ కోచ్