న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ట్వీట్ చేసింది. ప్రస్తుతం వారంతా క్రైస్ట్‌చర్చ్‌లోని ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది.
ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కొవిడ్ పాజిటివ్ - క్రికెటర్లకు కొవిడ్
సిరీస్ కోసం కివీస్ దేశం చేరుకున్న పాక్ క్రికెటర్లలో ఆరుగురికి కరోనా సోకినట్లు తేలింది. ప్రస్తుతం వారంతా ఐసోలేషన్‌లో ఉన్నారు.
ఆరుగురు పాకిస్థాన్ క్రికెటర్లకు కొవిడ్ పాజిటివ్
టూర్లో భాగంగా డిసెంబరు 10 నుంచి మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి కివీస్-పాక్. అంతకంటే ముందు వెస్టిండీస్‌తో రెండు టెస్టులు, మూడు టీ20లు ఆడనుంది న్యూజిలాండ్ జట్టు. ఈ శుక్రవారం రెండుజట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.