దశాబ్దం తర్వాత పాకిస్థాన్లో టెస్టు సిరీస్ ఆడనుంది శ్రీలంక. ఈ నేపథ్యంలో 2009 లాహోర్ ఉగ్రదాడిని గుర్తుచేసుకున్నారు ఐసీసీ మాజీ అంపైర్ సైమన్ టాఫెల్. ఆ ఘటన ఇప్పటికీ తన కళ్ల ముందు మెదలాడుతూనే ఉందని తన పుస్తకం 'ఫైండింగ్ ద గ్యాప్స్'లో ప్రస్తావించారు.
"ఆ రోజు నుంచి ఇప్పటివరకు పెద్ద ధ్వనులు విన్న ప్రతిసారీ ఆందోళనగా ఉంటుంది. ఈ పరిస్థితి నుంచి కోలుకునేందుకు సమయం పడుతుంది. తుపాకీ లేదా అలాంటి సౌండ్లు విన్నప్పుడు ఈ రోజుకూ అసౌకర్యంగా ఉంటుంది. ఆ చేదు జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉన్నాయి." -సైమన్ టాఫెల్.
ఆ సిరీస్లో అంపైర్లుగా వ్యవహరించిన నలుగురిలో టాఫెల్ ఒకరు. ఉగ్రదాడిలో శ్రీలంక ఆటగాళ్లు సంగక్కర, మెండిస్, సమరవీర గాయపడ్డారు.