తెలంగాణ

telangana

ETV Bharat / sports

దేవధర్ ట్రోఫీ: ఫైనల్లో భారత్- సీ.. గిల్, మయాంక్ శతకాలు - shubman fill

దేవధర్​ ట్రోఫీలో భారత్​- ఏతో జరిగిన మ్యాచ్​లో భారత్-​ సీ జట్టు 232 పరుగుల భారీ తేడాతో గెలిచింది. భారత్- సీ ఆటగాళ్లు శుభ్​మన్​ గిల్(143), మయాంగ్ అగర్వాల్ (120) సెంచరీలతో చెలరేగారు. జలజ్ సక్సేనా 7 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

శుభ్ మన్ గిల్

By

Published : Nov 2, 2019, 6:40 AM IST

Updated : Nov 2, 2019, 7:15 PM IST

దేవధర్ ట్రోఫీలో బారత్-​ ఏ తో జరిగిన మ్యాచ్​లో భారత్- సీ.. 232 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. రాంచీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్​లో భారత్ సీ ఆటగాళ్లు శుభ్​మన్ గిల్, మయాంక్ అగర్వాల్ శతకాలతో చెలరేగి 50 ఓవర్లకు 366 పరుగుల భారీ స్కోరు సాధించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన భారత్- ఏ 134 పరుగులకే ఆలౌటైంది. ఫలితంగా సోమవారం జరగనున్న ఫైనల్లో భారత్​- బీతో తలపడనుంది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్- సీ జట్టుకు శుభారంభం దక్కింది. కెప్టెన్ శుభ్​మన్ గిల్, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 226 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరి ధాటికి భారత్- ఏ బౌలర్లు తేలిపోయారు.

మయాంక్ అగర్వాల్ (120, 111 బంతుల్లో), శుభ్​మన్ గిల్ (143, 142 బంతుల్లో) సెంచరీలతో కదం తొక్కారు. వీరితో పాటు మరో క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ 29 బంతుల్లో 79 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్​ ఆడాడు.

అనంతరం బ్యాటింగ్​కు దిగిన భారత్- ఏ జట్టు.. ప్రత్యర్థి బౌలర్ జలజ్ సక్సేనా ధాటికి 134 పరుగులకే కుప్పకూలింది. కేవలం 41 పరుగులిచ్చి 7 వికెట్లు తీశాడు జలజ్. భారత్- ఏలో దేవ్​దత్ ​(31) ఒక్కడిదే అత్యుత్తమ స్కోరు.

ఇదీ చదవండి: ఒలింపిక్స్ అర్హతకు అడుకు దూరంలో భారత హాకీ జట్లు

Last Updated : Nov 2, 2019, 7:15 PM IST

ABOUT THE AUTHOR

...view details