ఐపీఎల్ ప్రస్తుత సీజన్లో దిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి స్టీవ్ స్మిత్ చేరినా.. ప్రస్తుత సారథి శ్రేయస్ అయ్యరే జట్టును నడిపించనున్నాడు. ఈ విషయాన్ని క్యాపిటల్స్ సీఈఓ వినోద్ బిస్త్ చెప్పాడు.
స్మిత్ వచ్చినా సరే కెప్టెన్సీ శ్రేయస్దే - ఐపీఎల్ లేటేస్ట్ న్యూస్
దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ కొనసాగుతాడని జట్టు సీఈఓ స్పష్టం చేశారు. సీనియర్లు రహానె, స్మిత్, అశ్విన్ లాంటి వాళ్ల అనుభవం యువ క్రికెటర్లకు పనికొస్తుందని అన్నారు.
స్మిత్ వచ్చినా సరే కెప్టెన్సీ శ్రేయస్దే
"కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కే మద్దతు ఇస్తున్నాం. అతడి సారథ్యంలో 2019లో మూడో స్థానంలో నిలిచాం.. 2020లో ఫైనల్ చేరాం. శ్రేయస్ కెప్టెన్సీలో జట్టు ఇలాగే రాణిస్తుందని ఆశిస్తున్నాం. జట్టులో స్మిత్, రహానె, అశ్విన్ లాంటి వాళ్లున్నా వాళ్ల అనుభవం కుర్రాళ్లకు ఎంతో అవసరం" అని అన్నారు.