పాకిస్థాన్ బౌలర్ మహ్మద్ ఆమిర్ రిటైర్మెంట్పై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. పాక్ క్రికెట్ బోర్డు అంగీకరిస్తే తిరిగి అతన్ని గాడిలో పెడ్తానని తెలిపాడు. అతడు నైపుణ్యం కలిగిన బౌలర్ అని కితాబిచ్చాడు.
"ఆమిర్‌ను నాకు అప్పగిస్తే బౌలింగ్‌లో అతన్ని రాటుదేల్చుతా. మైదానంలో అతడు అద్భుతాలు సృష్టిస్తాడు. జట్టుకు ఉపయోగపడ్తాడు.
-షోయబ్ అక్తర్
ఏం జరిగిందంటే..
పాక్ క్రికెట్ బోర్డు తనను మానసికంగా వేధిస్తుందనే ఆరోపణలతో ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు స్పష్టం చేశాడు. ఈ నిర్ణయంతో క్రికెట్ అభిమానులు షాక్‌కు గురయ్యారు. న్యూజిలాండ్ టూర్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు లేకపోవడం వీడ్కోలుకు మరో కారణం.
రిటైర్మెంట్కు సమ్మతించిన బోర్డు..
తమను సంప్రదించిన తర్వాతనే ఆమిర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని పీసీబీ తెలిపింది. బోర్డు సీఈఓ వసీం ఖాన్‌తో ఆమిర్ మాట్లాడాడని స్పష్టం చేసింది. ఆటకు దూరం కావాలనే అతడి నిర్ణయాన్ని తనకు చెప్పినట్లు బోర్డు సీఈఓ వసీంఖాన్ కూడా వెల్లడించాడు.
ఇదీ చదవండి:'ఆమిర్ రిటైర్మెంట్.. భావి క్రికెటర్లకు ఓ పాఠం'