తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ రోజుల్లో అయితే స్మిత్​కు చుక్కలే: అక్తర్

స్టీవ్ స్మిత్ బ్యాటింగ్​లో టెక్నిక్ ఉండదని, తను ఆడే కాలంలో అతడు ఉన్నట్లయితే ఇబ్బంది పెట్టేవాడినని అన్నాడు పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్.

స్టీవ్ స్మిత్ - అక్తర్

By

Published : Nov 7, 2019, 5:13 PM IST

శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో అర్ధశతకంతో చెలరేగిన ఆసీస్ క్రికెటర్ స్టీవ్​స్మిత్​పై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇలాంటి సమయంలో అతడిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు పాకిస్థాన్ మాజీ ఆటగాడు షోయబ్​ అక్తర్. స్మిత్ బ్యాటింగ్​లో టెక్నిక్ ఉండదని, ఆటను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుందని అన్నాడు.

"స్టీవ్ స్మిత్ ఎలా ఆడుతున్నాడో అర్థం కావట్లేదు. అతడి బ్యాటింగ్​లో టెక్నిక్ ఉండదు. కానీ శైలి విభిన్నంగా ఉంటుంది. నేను ఆడిన సమయంలో స్మిత్ ఉన్నట్లయితే నా బౌలింగ్​తో ఇబ్బంది పెట్టేవాడినే. ఇప్పుడైతే అది చాలా కష్టమనిపిస్తోంది. బాగా ఆడుతున్నాడు. అతడికి ఆల్ ది బెస్ట్" -షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.

ఈ మ్యాచ్​లో స్మిత్.. 80 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఏడాది తర్వాత పునరాగమనం చేసినా స్మిత్ ప్రదర్శన ఇంతకుముందు కంటే మెరుగైంది. ప్రపంచకప్, యాషెస్ సిరీస్​ల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. టెస్టు ర్యాంకింగ్స్​లో మొదటి స్థానాన్ని తిరిగి కైవసం చేసుకున్నాడు.

ఇదీ చదవండి: చైనా ఓపెన్​ సింగిల్స్​లో భారత్​ పోరు ముగిసెన్

ABOUT THE AUTHOR

...view details