తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​లో టీమిండియా 'బాస్' : అక్తర్

బంగ్లాపై విజయం సాధించి భారత్ 'బాస్' అని నిరూపించుకుందని చెప్పాడు షోయబ్ అక్తర్. మొదటి మ్యాచ్​లో ఓడినా తర్వాత పుంజుకుందని ప్రశంసించాడు.

షోయబ్ అక్తర్

By

Published : Nov 12, 2019, 3:49 PM IST

బంగ్లాదేశ్​తో టీ20 సిరీస్​ను కైవసం చేసుకున్న టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్. క్రికెట్​లోభారత్ మరోసారి 'బాస్' అని నిరూపించుకుందని చెప్పాడు.

"ఈ మ్యాచ్​లో గెలిచి టీమిండియా బాస్ అని నిరూపించుకుంది. తొలి టీ20లో ఓడినప్పటికీ.. రెండో మ్యాచ్​లో రోహిత్ శర్మ చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకొని జట్టును గెలిపించాడు. అతడు ప్రతిభ గల ఆటగాడు. మూడో టీ20లో బంగ్లాదేశ్ ఆటకు హ్యాట్సాఫ్. గట్టి పోటీనిచ్చింది. అయితే భారత్ మళ్లీ పుంజుకొని సిరీస్ కైవసం చేసుకుంది."

- షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.

ఆఖరి టీ20లో వైవిధ్యమైన బౌలింగ్​తో దీపక్ చాహర్ ఆకట్టుకున్నాడని అన్నాడు అక్తర్.

"అతడి బౌలింగ్‌లో(దీపక్) మీడియం పేస్‌, సీమ్‌ కలిసుంది. చివర్లో హ్యాట్రిక్‌ సాధించి అద్భుతమైన ప్రదర్శన చేశాడు".

- షోయబ్ అక్తర్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.

బంగ్లాదేశ్​తో జరిగిన మూడు టీ20ల సిరీస్​లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించింది. నవంబరు 14 నుంచి రెండు టెస్టులు ఆడనున్నాయి ఇరు జట్లు.

ఇదీ చదవండి: విండీస్ క్రికెట్​ పీడ విరగడైంది: బ్రావో

ABOUT THE AUTHOR

...view details