కనేరియాను వివక్షకు గురిచేశారన్న వ్యాఖ్యలతో కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ అక్తర్ తాజాగా ఇంకో బాంబ్ పేల్చాడు. ఆ జట్టు మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌కు సంబంధించిన ఒక లీకైన వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. ఇందులో అక్రమ్ మాట్లాడూతూ కింది విధంగా స్పందించాడు.
పాక్ క్రికెటర్ అక్రమ్ లీక్ వీడియో.. అక్తర్ పోస్ట్ - షోయబ్ అక్తర్
పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ విడుదల చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆ దేశ మాజీ క్రికెటర్ అక్రమ్‌కు సంబంధించిన లీకైన వీడియో అది.
"అచ్చం గతంలో జరిగిన విధంగానే ఇప్పుడు జరుగుతోంది. ఇది మన క్రికెట్‌ను ధ్వంసం చేస్తుంది. ఈ విధానంలో మార్పు తెచ్చేందుకు కొత్త పద్ధతులను అవలంబించాలి. మన ఆలోచనా విధానాలు కూడా మారాలి. అందుకోసం కొత్తగా ప్రయత్నించాలి"
-అక్రమ్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
ఈ వీడియోను పోస్ట్ చేసిన అక్తర్.. వసీం అక్రమ్ మాటలను సమర్థిస్తున్నానని చెప్పాడు. పాకిస్థాన్ క్రికెట్‌లో మార్పులు అవసరమని అన్నాడు. ఇదిలా ఉండగా అక్తర్ ఇదివరకు ఒక వీడియోలోమాట్లాడుతూ డానిష్ కనేరియాను సహచరులు మతం పేరిట వివక్షకు గురిచేశారని తెలిపాడు.