తెలంగాణ

telangana

కరోనాపై పోరుకు విరాళాల కోసం భారత్​ X పాక్ సిరీస్!

ప్రస్తుతం కరోనా వల్ల ప్రపంచమంతా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఇలాంటి సమయంలో కరోనా బాధితులకు అండగా నిలబడేందుకు భారత్,​ పాక్ ప్రభుత్వాలు ముందుకు రావాలని సూచించాడు పాక్ మాజీ ఆటగాడు అక్తర్. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలని కోరాడు.

By

Published : Apr 9, 2020, 7:38 AM IST

Published : Apr 9, 2020, 7:38 AM IST

అక్తర్
అక్తర్

ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మహమ్మారి వల్ల కఠిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఈ వైరస్ ప్రభావంతో క్రికెట్ సిరీస్​లన్నీ రద్దయ్యాయి. అయితే తాజాగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్​ ఓ ఆసక్తికర అంశాన్ని లేవనెత్తాడు. కరోనా బాధితులకు అండగా విరాళాలు సేకరించేందుకు భారత్-పాకిస్థాన్ మధ్య సిరీస్ నిర్వహించాలని సూచించాడు.

"ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నేను భారత్​-పాక్ మధ్య మూడు మ్యాచ్​ల సిరీస్ నిర్వహించాలని కోరుతున్నా. ఈ సిరీస్ వల్ల ఎవరూ బాధపడరు. కోహ్లీ సెంచరీ కొడితే పాక్ అభిమానులు సంతోషిస్తారు. బాబర్ ఆజామ్ శతకం సాధిస్తే భారత అభిమానులు హర్షం వ్యక్తం చేస్తారు. మైదానంలో ఏం జరిగినా రెండు దేశాలు గెలుస్తాయి. మ్యాచ్​లకు వీక్షణలు కూడా రికార్డు స్థాయిలో వస్తాయి. ఈ మ్యాచ్​ల ద్వారా వచ్చిన మొత్తాన్ని రెండు దేశాలు పంచుకోవాలి. కరోనాపై పోరుకు ఇవి ఉపయోగపడతాయి."

-షోయబ్ అక్తర్, పాక్ మాజీ క్రికెటర్

ప్రస్తుతం పరిస్థితులు బాగా లేవన్నాడు అక్తర్. కరోనా ప్రభావం తగ్గాక తటస్థ వేదికగా మ్యాచ్​లు నిర్వహించాలని సూచించాడు. ఆటగాళ్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలన్నాడు.

ABOUT THE AUTHOR

...view details