తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ క్రికెటర్​కు బౌలింగ్​ వేయడం చాలా కష్టం' - virat and shoab akthar

పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​... మరోసారి వార్తల్లో నిలిచాడు. తన పేస్​ బౌలింగ్​తో ప్రపంచ క్రికెట్​లో టాప్​ బ్యాట్స్​మన్లను భయపెట్టిన అతడు... తాజాగా భారత్​కు చెందిన ఓ క్రికెటర్​పై మాత్రం ప్రశంసలు కురిపించాడు.

'ఆ క్రికెటర్​కు బౌలింగ్​ వేయడం చాలా కష్టం'

By

Published : Nov 17, 2019, 6:37 PM IST

పాకిస్థాన్ మాజీ క్రికెటర్​ షోయబ్​అక్తర్​... తనదైన వేగం, పేస్​తో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. తనదైన బౌలింగ్​తో ఎందరో బ్యాట్స్​మన్లను ఇబ్బంది పెట్టిన అక్తర్​కు... రావల్పిండి ఎక్స్​ప్రెస్​గానూ పేరుంది. ఇంతటి ప్రముఖ బౌలర్​ టీమిండియా సారథి విరాట్​ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం క్రికెట్‌ విశ్లేషకుడిగా కొనసాగుతున్న అక్తర్​... తాజాగా ట్విట్టర్​ వేదికగా అభిమానుల ప్రశ్నలకు సమాధానమిచ్చాడు​.

ఆధునిక​ క్రికెట్​లో ఎవరికి బౌలింగ్​ వేయడం కష్టమో చెప్పాలని ఓ నెటిజన్​ కోరగా... విరాట్​ కోహ్లీ అని సమాధానమిచ్చాడు అక్తర్​. అంతేకాకుండా కోల్​కతా టెస్టులో దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​ను ఔట్​ చేయడమే తన జీవితంలో గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు.

బంగ్లాదేశ్‌పై తొలి టెస్టును గెలిచిన టీమిండియా... తొలిసారి చారిత్రక డే/నైట్​ మ్యాచ్​కు సిద్ధమౌతోంది. ఈడెన్​ గార్డెన్స్​ వేదికగా నవంబర్​ 22-26 వరకు ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details