తెలంగాణ

telangana

ఆల్​రౌండర్​ అంటే.. ఫిట్​గా ఉండాల్సిందే: దూబే

By

Published : Nov 28, 2019, 5:30 AM IST

ఆల్​రౌండర్​గా కొనసాగాలంటే ఫిట్​గా ఉండడం తప్పనిసరి అని అంటున్నాడు టీమిండియా యువ ఆటగాడు శివమ్ దూబే. విండీస్​తో సిరీస్​లో సత్తాచాటి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నాడు.

shivam dubey says fitness is necessary to the allrounders
శివమ్ దూబే

ఇటీవల బంగ్లాదేశ్​తో జరిగిన మూడు టీ20ల సిరీస్​లో అరంగేట్రం చేసి సత్తాచాటాడు టీమిండియా యువ ఆల్​రౌండర్ శివమ్ దూబే. దేశవాళీలో ఆకట్టుకుంటున్న ఈ క్రికెటర్ ఫిట్​నెస్​పైనే దృష్టి పెడతానని అంటున్నాడు. అదే విధంగా జట్టులో స్థానాన్ని సుస్థిరపరచుకునేందుకు కృషి చేస్తానని చెబుతున్నాడు.

"ఫిట్​గా ఉండేందుకు గంటల కొద్ది శ్రమిస్తా. ఆల్‌రౌండర్‌గా నా స్కిల్స్‌ పెంచుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటా. మ్యాచ్‌లు లేని సమయాల్లో నా బౌలింగ్‌ను మెరుగుపర్చుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెడతా. అక్కడ నేర్చుకున్నవి మ్యాచ్​ల్లో అమలు చేస్తా. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో దృష్టి సారిస్తున్నందున కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే ఆల్‌రౌండర్‌గా ఉన్నపుడు ఇలాంటివి ఎదుర్కొనక తప్పదు. జట్టులో స్థానాన్ని సుస్థిరపరచుకోవాలని అనుకుంటున్నా" - శివమ్ దూబే, టీమిండియా ఆల్​రౌండర్​

ప్రస్తుతం దూబే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబై తరపున ఆడుతున్నాడు. వచ్చే నెలలో జరిగే భారత పర్యటనకు వెస్టిండీస్ రానుంది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్​లో దూబే ఎంపికయ్యాడు. విండీస్​తో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది టీమిండియా.

ఇదీ చదవండి: తొలి టీ20 హైదరాబాద్​లో.. చివరిది ముంబయిలో

ABOUT THE AUTHOR

...view details