తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​తో టీ20లకు ధావన్ స్థానంలో శాంసన్ - West Indies series

టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ గాయం నుంచి కోలుకోని కారణంగా వచ్చే నెలలో వెస్టిండీస్​తో జరిగే టీ20 సిరీస్​కు దూరమయ్యాడు. అతడి స్థానాన్ని యువ క్రికెటర్ సంజు శాంసన్ భర్తీ చేస్తున్నాడు.

Shikhar Dhawan
ధావన్

By

Published : Nov 27, 2019, 12:17 PM IST

వరుస వైఫల్యాలతో విఫలమవుతోన్న టీమిండియా ఓపెనర్​ శిఖర్​ ధావన్​కు ఏదీ కలిసి రావట్లేదు. ఇటీవలే బంగ్లాదేశ్​తో జరిగిన టీ20 సిరీస్​లోనూ విఫలమయ్యాడు. వచ్చే నెలలో వెస్టిండీస్​తో జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్​కు ఎంపికైనా.. ఇప్పుడు గాయం కారణంగా టీ20 సిరీస్​కు దూరమయ్యాడు.

ఫామ్ కోసం దేశవాళీ టోర్నీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడుతోన్న ధావన్ గాయం బారిన పడ్డాడు. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ కారణంగానే శిఖర్ స్థానంలో సంజూ శాంసన్​కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.

ప్రపంచకప్ తర్వాత 8 టీ20లు ఆడిన ధావన్..​ 194 పరుగులు మాత్రమే చేసి విమర్శలపాలయ్యాడు. ప్రస్తుతం జరుగుతోన్న సయ్యద్ ముస్తక్ అలీ టోర్నీలో ఐదు మ్యాచ్​ల్లో 87 పరుగులు మాత్రమే చేసి నిరాశపర్చాడు.

ఇవీ చూడండి.. 'పెళ్లికాక ముందు ప్రతి మగాడు సింహంలాంటోడే'

ABOUT THE AUTHOR

...view details