టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. దాదాపు నాలుగు నెలల తర్వాత మైదానంలో దిగాడు. దాదాపు నాలుగు గంటలపాటు ప్రాక్టీసు చేశాడు. ఆ వీడియోను ట్వీట్ చేశాడు. ఇందులో బంతులను ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ కనిపించాడు. జోరు కొనసాగిస్తున్నాను. బంతిని బాదే శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాననే వ్యాఖ్య జోడించాడు.
ప్రాక్టీసులో గబ్బర్.. బౌండరీలు బాదేస్తూ బిజీ - దిల్లీ క్యాపిటల్స్ వార్తలు
నాలుగు నెలల తర్వాత ప్రాక్టీసులో దిగిన ధావన్.. బంతులను బౌండరీలకు తరలిస్తూ బిజీగా కనిపించాడు. త్వరలో ప్రారంభమయ్యే ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

శిఖర్ ధావన్
సెప్టెంబరు 19 నుంచి మొదలవనున్న ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడనున్నాడు ధావన్. యూఏఈ వేదికగా ఈ టోర్నీ జరగనుంది. ఈ మేరకు ఆగస్టు 15 నుంచి తమ జట్టులోని భారత క్రికెటర్లు శిక్షణా శిబిరాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది దిల్లీ యాజమాన్యం.