ధోనీసేనపై సాధికార గెలుపుతో దిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆనందం నెలకొంది. అర్ధసెంచరీలతో కదం తొక్కిన ఓపెనర్లు పృథ్వీ షా, శిఖర్ ధావన్‌లు మ్యాచ్ అనంతరం ఉల్లాసంగా డ్యాన్సులు చేస్తూ వీడియో షేర్ చేశారు.
డ్రెస్సింగ్ రూమ్‌లో గబ్బర్, పృథ్వీ షా డ్యాన్స్ - డ్రెస్సింగ్ రూమ్‌లో గబ్బర్, పృథ్వీ షా డ్యాన్స్
చెన్నై సూపర్ కింగ్స్‌పై విజయం సాధించాక దిల్లీ క్యాపిటల్స్ డ్రెస్సింగ్ రూమ్‌లో ధావన్, పృథ్వీ షా ఉల్లాసంగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ వీడియోను ధావన్ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నాడు.
బ్యాట్ పట్టుకుని మరో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నట్టు కనిపించిన షాను చూసి ధావన్ ఆటపట్టించాడు. ఓ పాట పాడుకుంటూ వచ్చి ఏకంగా రెండు చేతులతో షాను పైకెత్తుకోవాలని చూశాడు. కానీ ఎక్కువ బరువు ఉండటం వల్ల అది సాధ్యం కాలేదు. దీంతో ఇద్దరూ నవ్వుకున్నారు.
కాగా, నిన్నటి మ్యాచ్‌లో షా 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 38 బంతుల్లోనే 72 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ ధావన్ కూడా 10 బౌండరీలు, రెండు సిక్సర్లతో 85 పరుగులు సాధించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇద్దరూ విరుచుకుపడటం వల్ల దిల్లీ ఒక ఓవర్ మిగిలి ఉండగానే సునాయాస విజయం సాధించింది.