తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధావన్ డకౌట్.. దిల్లీపై జమ్ముకశ్మీర్ రికార్డు విజయం - Shikhar Dhawan

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆడిన మొదటి మ్యాచ్​లోనే టీమిండియా ఆటగాడు ధావన్ డకౌట్​గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్​లో దిల్లీపై జమ్ము కశ్మీర్​ ఘనవిజయం సాధించింది.

ధావన్

By

Published : Nov 14, 2019, 8:28 PM IST

దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటి తిరిగి టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలనుకున్న ధావన్​కు మొదటి మ్యాచ్​లోనే చుక్కెదురైంది. ముస్తాక్ అలీ జాతీయ టీ20 టోర్నీలో భాగంగా దిల్లీ జట్టుకు ఆడిన ధావన్​ జమ్ము కశ్మీర్​తో జరిగిన మ్యాచ్​లో డకౌట్​గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్​లో జమ్మూ .. దిల్లీపై ఘనవిజయం సాధించింది.

మొదట బ్యాటింగ్​ చేసిన దిల్లీ జట్టులో నితీశ్ రానా (55, 30 బంతుల్లో) అర్ధశతకంతో సత్తాచాటాడు. ధావన్ డకౌట్​ అయ్యాడు. మిగతా వారు అంతగా ఆకట్టుకోలేకపోయిందున దిల్లీ 165 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన జమ్ము కశ్మీర్ జట్టు ఓపెనర్లు వధవాన్ (48), ఖజురియా (49) విజృంభించడం వల్ల 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ టోర్నీలో దిల్లీ జట్టుకు ఇది తొలి ఓటమి కాగా.. జమ్ము కశ్మీర్​కు తొలి విజయం కావడం విశేషం.

ఇవీ చూడండి.. 'విరామ సమయంలో హ్యాట్రిక్​ గురించే ఆలోచించా'

ABOUT THE AUTHOR

...view details