టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధావన్.. దాదాపు ఏడాది కాలం తర్వాత జట్టులోకి రావాలని చూస్తున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ జట్టులో స్థానం కోసం తన వంతుగా కష్టపడతున్నట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అవకాశం దొరికితే నిరూపించుకోవడానికి సిద్ధమని తెలిపాడు. సెలక్షన్ అనేది తన పరిధిలోని విషయం కాదు కాబట్టి ప్రదర్శనతోనే అందర్నీ ఆకర్షించాలని చూస్తున్నాడు గబ్బర్.
శిఖర్ ధావన్ గాయాలతో విశ్రాంతి తీసుకున్న సమయంలో అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను బరిలోకి దించింది జట్టు యాజమాన్యం. ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా అత్యుత్తమ ప్రదర్శన అందించాడీ యువక్రికెటర్. కివీస్‌తో జరిగిన 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 224 పరుగులు సాధించాడు. దీంతో మళ్లీ ఓపెనర్‌గా ధావన్ జట్టులోకి వస్తాడా.. లేదా అనే అనుమానం వ్యక్తమవుతోంది. రాహుల్.. వికెట్ కీపర్‌గా మారి రిషబ్ అవకాశాన్ని ఎలా చేజార్చాడో.. ధావన్‌కు ఇప్పడదే పరిస్థితి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.