లాక్డౌన్లో ఇంటికే పరిమితమైన టీమ్ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ తన కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. తన కుమారుడు జోరావర్‌తో కలిసి టిక్‌టాక్ వీడియోలు చేస్తున్నాడు. అయితే తనను ఉదయాన్నే నిద్ర లేపడం చాలా కష్టమైన పని అని అంటున్నాడీ ఓపెనర్. అలా చేసేందుకు ఎంత కష్టపడ్డాడో చెబుతూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.
క్రికెటర్ ధావన్ జీవితంలో కష్టమైన పని అదే - Zoraver latest news
సునాయసంగా సిక్స్‌లు, ఫోర్లు కొట్టే క్రికెటర్ ధావన్‌కు ఓ పని చేయడం చాలా కష్టమట. ఇంతకీ అదేంటి? తెలియాలంటే ఇది చదవాల్సిందే.
![క్రికెటర్ ధావన్ జీవితంలో కష్టమైన పని అదే Shikhar Dhawan Discloses What Is The "Toughest Task" Nowadays](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8233040-thumbnail-3x2-hd.jpg)
"ప్రతిరోజు ఉదయం జోరావర్‌ను బెడ్ నుంచి బయటకు తీసుకురావడం చాలా కష్టమైన పని. అయితే అతడ్ని లేపడానికి మరెన్నో దారులు ఉన్నాయి" అని వ్యాఖ్య జోడించాడు ధావన్. జోరావర్‌తో కలిసి తీసుకున్న హాస్యభరిత ఫొటోను ఇటీవలే పోస్ట్ చేశాడు శిఖర్. అందులో వారిద్దరూ ముక్కుపుడకల లాంటి వస్తువుల్ని పెట్టుకుని కనిపించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ధావన్. ఈ టోర్నీ యూఏఈ వేదిక సెప్టెంబరు 19 నుంచి ప్రారంభం కానుంది. వచ్చే వారం పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనుంది బీసీసీఐ. గత సీజన్లో 16 మ్యాచ్‌లాడి 34.73 సగటుతో 521 పరుగులు చేశాడు ధావన్. మొత్తంగా 159 మ్యాచ్‌ల్లో 4,579 పరుగులు సాధించాడు.