తెలంగాణ

telangana

ETV Bharat / sports

ధావన్​ త్రో బ్యాక్​ ఫొటో.. అస్సలు గుర్తుపట్టలేముగా - శిఖర్​ ధావన్​ పుట్టినరోజు శుభాకాంక్షలు

టీమ్​ఇండియా క్రికెటర్​ శిఖర్​ ధావన్​ శనివారం 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నాడు. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు గబ్బర్​కు బర్త్​డే విషెస్ తెలుపుతూ.. సామాజిక మాధ్యమాల వేదికగా అతడిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.

Shikhar Dhawan
గబ్బర్​

By

Published : Dec 5, 2020, 1:11 PM IST

Updated : Dec 5, 2020, 3:17 PM IST

అతడు మైదానంలో గర్జిస్తే బౌలర్లకు చుక్కలే. బంతిని బాదితే స్టేడియం బౌండరీలతో హోరెత్తాల్సిందే. అంతర్జాతీయ కెరీర్​లో తన పేరిట ఎన్నో రికార్డులను లిఖించుకున్న అతడు ఐపీఎల్​లోనూ ఎన్నోసార్లు తమ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. అందరూ అతడిని ముద్దుగా 'గబ్బర్'​ అని పిలుస్తుంటారు. ఇంకెవరో అర్థమైపోయి ఉంటుంది కదా.. అతడే టీమ్​ఇండియా బ్యాట్స్​మన్​ శిఖర్​ ధావన్​. శనివారం గబ్బర్ 35వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పలువురు మాజీ, వర్ధమాన క్రికెటర్ల నుంచి సోషల్​మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి.

ట్విటర్‌ వేదికగా బీసీసీఐ, ఐసీసీ, దిల్లీ క్యాపిటల్స్‌ కూడా గబ్బర్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పాయి. అతడు మరింత బాగా రాణించాలని ఆకాంక్షించాయి. గబ్బర్‌ తన బ్యాటింగ్‌తో భారత అభిమానులను అలరించాలని మాజీ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, యువరాజ్ సింగ్‌, గౌతమ్‌ గంభీర్‌ సైతం ట్వీట్లు చేశారు.

ఈ క్రమంలోనే డాషింగ్‌ ఓపెనర్‌‌ సెహ్వాగ్‌ చేసిన ట్వీట్‌ నెటిజన్లను ఆకర్షిస్తోంది. అందులో ధావన్‌ యువకుడిగా ఉన్నప్పటి (గుర్తుపట్టలేని) ఫొటోను అభిమానులతో పంచుకొని సరదా వ్యాఖ్యలు చేశాడు. కాగా, కెరీర్​లో ఇప్పటివరకు 34 టెస్టులు(2,315 పరుగులు), 139 వన్డేలు(5,808), 62 టీ20(1,589), 176ఐపీఎల్​ మ్యాచులు(5,197) ఆడాడు ధావన్. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతోన్న సిరీస్​లో ఆడుతున్నాడు

Last Updated : Dec 5, 2020, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details