వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్లో మరోసారి విజృంభించింది భారత మహిళా జట్టు ఓపెనర్ షెఫాలి వర్మ(69). సెయింట్ లూసియా వేదికగా జరిగిన రెండో టీ20లో ఆమె అర్ధశతకంతో ఆకట్టుకోగా. మరో స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా 30 పరుగులతో నిలకడగా ఆడింది. ఫలితంగా టీమిండియా అమ్మాయిలు 10 వికెట్ల తేడాతో గెలిచారు. 5 టీ20ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లారు.
మొదట బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 103 పరుగులే చేసింది. కరీబియన్ జట్టులో చెడీన్ నేషన్(32) మినహా మిగతా వారు విఫలమయ్యారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసింది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న దీప్తికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.