తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఓపెనర్లుగా షా, మయాంక్​.. మిడిలార్డర్​లో రాహుల్​' - kl rahul in middle ordr

హామిల్టన్​ వేదికగా ఫిబ్రవరి 5న భారత్​- న్యూజిలాండ్​ మధ్య తొలి వన్డే జరగనుంది. ఇందులో భారత బ్యాటింగ్​ లైనప్​లో భారీగా మార్పులు జరగనున్నాయి. రోహిత్​, ధావన్​ గాయాలతో జట్టుకు దూరమవగా.. వారి స్థానాల్లో చోటు దక్కించుకున్నారు మయాంక్​, పృథ్వీ షా. వీరిద్దరూ ఓపెనింగ్​ చేసే అవకాశం ఉంది.

Shaw, Agarwal set to make ODI debut after Kohli says Rahul will bat in middle-order
'బ్యాటింగ్‌ స్థానాల్లో భారీ మార్పులు పక్కా'

By

Published : Feb 4, 2020, 1:56 PM IST

Updated : Feb 29, 2020, 3:33 AM IST

న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డేల్లో టీమిండియా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో భారీ మార్పులు జరగనున్నాయి. ఏడాది విరామం తర్వాత భారత సీనియర్‌ జట్టులోకి వచ్చిన పృథ్వీషా ఓపెనర్‌గా బరిలోకి దిగుతాడని.. సూపర్‌ఫామ్‌లో ఉన్న కేఎల్ రాహుల్‌ మిడిలార్డర్‌లో వస్తాడని స్పష్టం చేశాడు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ.

" గాయంతో రోహిత్ అనూహ్యంగా వన్డే సిరీస్‌కు దూరమవ్వడం దురదృష్టకరం. మ్యాచ్‌పై రోహిత్​ ఎంత ప్రభావం చూపిస్తాడో అందరికీ తెలుసు. ప్రస్తుతం వన్డే సిరీస్‌లు మాకు ఎక్కువగా లేవు. అతడు కోలుకోవడానికి ఇదే సరైన సమయం. అయితే ఈ సిరీస్‌తో వన్డేల్లో ఓపెనర్‌గా పృథ్వీషా అరంగ్రేటం చేయనున్నాడు. కేఎల్‌ రాహుల్‌ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌ చేస్తాడు. మిడిల్‌లో రాహుల్​ అలవాటు పడాలని భావిస్తున్నాం".

-- విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

ఫీల్డింగ్​పై మరింత దృష్టి...

ఇటీవల ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్​లో గొప్పగా పోరాడినట్లు చెప్పిన కోహ్లీ... ఫీల్డింగ్​లో తప్పిదాలు జరిగాయని వాటిపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పాడు.

" ఆస్ట్రేలియాతో సిరీస్​లో తొలి మ్యాచ్ ఓడినా తిరిగి పుంజుకొని 2-1తో ట్రోఫీ కైవసం చేసుకున్నాం. ఈ విజయంతో మాలో మరింత విశ్వాసం పెరిగింది. మా ప్రణాళికలను అమలు చేస్తూ పాజిటివ్‌ క్రికెట్‌ ఆడాలని భావిస్తున్నాం. వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్‌ గట్టిపోటీనిస్తుందని తెలుసు. అయితే మేం ఫీల్డింగ్‌లో మరింత మెరుగవ్వాలి. గత సిరీస్‌లో (కివీస్‌ టీ20) పేలవంగా ఫీల్డింగ్‌ చేసినా టీ20ల్లో విజయం సాధించాం. కానీ వన్డేల్లో అలా కుదరదు, ఫలితాలు మారుతుంటాయి. మైదానంలో చురుకుగా ఉండటానికి ప్రయత్నిస్తాం. దీనిపై మరింత దృష్టి సారించాలి"

--విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో టీమిండియా రేపు తొలి మ్యాచ్‌ ఆడనుంది. రోహిత్‌ శర్మ గాయంతో జట్టుకు దూరమవ్వడం వల్ల అతని స్థానంలో మయాంక్‌ అగర్వాల్‌ ఎంపికయ్యాడు. ఇటీవల జరిగిన అయిదు టీ20ల సిరీస్‌ను భారత్‌ 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసి చరిత్ర సృష్టించింది.

Last Updated : Feb 29, 2020, 3:33 AM IST

ABOUT THE AUTHOR

...view details