తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రత్యేక అభిమానిని ఆప్యాయంగా కలిసిన షారుఖ్ - బాద్ షా

కోల్​కతా, హైదరాబాద్ మధ్య జరుగుతున్న మ్యాచ్​కు షారుఖ్ ఖాన్ విచ్చేశాడు. స్టేడియానికి వచ్చిన ఓ ప్రత్యేక అభిమానిని కలిశాడు బాలీవుడ్ బాద్ షా.

షారుఖ్ ఖాన్

By

Published : Mar 25, 2019, 12:08 AM IST

Updated : Mar 25, 2019, 7:50 AM IST

ఈడెన్​గార్డెన్స్​లోసన్​రైజర్స్, నైట్​రైడర్స్ మ్యాచ్​ సందర్భంగా కింగ్ ఖాన్ షారుఖ్​ సందడి చేశాడు. తనను చూడటానికి విచ్చేసిన ఓ అభిమానిని ప్రత్యేకంగా కలిశాడు బాద్ షా.

చక్రాల కుర్చీలో కదలలేని స్థితిలో ఉన్న ఆ యువకుడితో మాట్లాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనారోగ్యంతో బాధపడుతున్న అభిమాని కోరిక తీర్చినందుకు నెటిజన్లు షారుఖ్​ను అభినందిస్తున్నారు.

  • హైదరాబాద్, కోల్​కతా మ్యాచ్​లో రైడర్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. రసెల్ మెరుపు ఇన్నింగ్స్​తో జట్టును ఓటమి నుంచి కాపాడాడు. రసెల్ 19 బంతుల్లో 49 పరుగులు చేసి సన్​రైజర్స్​కు విజయాన్ని దూరం చేశాడు. 182 పరుగుల లక్ష్యాన్ని మరో రెండు బంతులు మిగిలుండగానే ఛేదించింది కోల్​కతా.
Last Updated : Mar 25, 2019, 7:50 AM IST

ABOUT THE AUTHOR

...view details