తెలంగాణ

telangana

By

Published : Jun 26, 2020, 2:53 PM IST

ETV Bharat / sports

'వన్డేలో సూపర్​ ఓవర్ వద్దు.. ట్రోఫీ షేరింగ్​ ముద్దు'

వన్డే టోర్నీల్లో ఫైనల్​ మ్యాచ్​ టై అయితే, ఇరు జట్లు ట్రోఫీని సమంగా పంచుకోవాలని న్యూజిలాండ్​ సీనియర్​ బ్యాట్స్​మన్​ రాస్​​ టేలర్​ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ ఫార్మాట్​లో సూపర్​ ఓవర్​ అవసరం లేదని తెలిపాడు.

Ross Taylor
రాస్​ టేలర్​

వన్డే ఫార్మాట్​లో సూపర్​ ఓవర్​ అవసరం లేదని న్యూజిలాండ్​ సీనియర్ బ్యాట్స్​మన్​ రాస్​​ టేలర్​ అభిప్రాయపడ్డాడు. మ్యాచ్​ టై అయితే, ట్రోఫీని ఇరు జట్లు సమానంగా పంచుకోవడంలో ఎటువంటి అభ్యంతరం లేదని వెల్లడించాడు. ఈఎస్​పీఎన్​ క్రిక్​ఇన్ఫో సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు టేలర్​.

"వన్డేల్లో సూపర్​ ఓవర్ల గురించి ఇంకా ఎలాంటి నిర్ణయానికి రాలేదు. చాలా కాలంగా వన్డే టోర్నీలు జరుగుతున్నాయి. ఒకవేళ టై అయితే, దాన్ని అలాగే ప్రకటించినా ఎలాంటి సమస్య ఉండదు. టీ20లో సూపర్​ ఓవర్ ఉండటం సరైనదే. కానీ, వన్డేల్లో అవసరం అని నేను అనుకోవడం లేదు. టై అయితే, ఇరుజట్లను విజేతలుగా ప్రకటిస్తే బాగుంటుంది."

-టేలర్​, న్యూజిలాండ్​ క్రికెటర్​

గతేడాది న్యూజిలాండ్- ఇంగ్లాండ్​ జట్ల మధ్య జరిగిన వరల్డ్​కప్​ ఫైనల్లో ఇరుజట్ల స్కోర్లు సమం కాగా​ సూపర్ ఓవర్ నిర్వహించారు​. అందులోనూ రెండు జట్లు ఒకే పరుగులు సాధించగా.. బౌండరీ కౌంట్ ఆధారంగా ఇంగ్లాండ్​ను విజేతగా ప్రకటించారు. దీంతో ఐసీసీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఫలితంగా ఈ నిబంధనను సర్దుబాటు చేస్తూ.. సెమీఫైనల్​, ఫైనల్​ మ్యాచ్​ల్లో విజేతలు తేలే వరకు సూపర్​ ఓవర్ల నిర్వహణకు అనుమతిచ్చింది ఐసీసీ.

రాస్​ టేలర్​

ఇదీ చూడండి:ఆ రికార్డు సాధించిన ఏకైక క్రికెటర్​గా టేలర్

ABOUT THE AUTHOR

...view details