ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో తలపడే టీమ్‌ఇండియా జట్టులో ఐదో పేసర్ స్థానం కోసం మహ్మద్ సిరాజ్ (హైదరాబాద్), శార్దూల్ ఠాకూర్ (ముంబయి)ల మధ్య పోటీ నెలకొంది. ఆస్ట్రేలియాలో 4 టెస్టులు, రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సునీల్ జోషి సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ ఈ వారంలో టీమ్‌ఇండియాను ఎంపిక చేయనుంది. టెస్టుల్లో పేసర్లు మహ్మద్ షమి, బుమ్రా, ఉమేశ్‌యాదవ్‌ల స్థానాలకు ఢోకా లేదు. గాయాల కారణంగా సీనియర్ బౌలర్లు భువనేశ్వర్, ఇషాంత్‌శర్మలు ఆసీస్ పర్యటనకు దూరమవగా.. నాలుగో పేసర్ స్థానంలో నవదీప్ సైనీకి చోటు దక్కడం దాదాపు ఖాయమే.
శార్దూల్ x సిరాజ్: ఐదో పేసర్ స్థానం కోసం పోటీ - మహ్మద్ సిరాజ్ వార్తలు
డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటన కోసం టీమ్‌ఇండియా జట్టును ఎంపిక చేయనుంది సెలక్షన్ కమిటీ. టెస్టు టీమ్ కూర్పు దాదాపుగా పూర్తవ్వగా.. అందులో ఐదో పేసర్ కోసం మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్లను పరిశీలిస్తోంది.

ఇండియా-ఎ, రంజీ ట్రోఫీలో సత్తాచాటిన సిరాజ్ ఐదో పేసర్ స్థానానికి పోటీ పడుతున్నాడు. కొత్త బంతితో స్వింగ్‌ను రాబట్టగల శార్దూల్ కూడా రేసులో ఉన్నాడు. పరిమిత ఓవర్ల సిరీస్ కోసం శార్దూల్, దీపక్ చాహర్‌ల ఎంపిక ఖాయంగా కనిపిస్తోంది. ఉమేశ్ యాదవ్‌కు చోటు లభించడం అనుమానమే. వన్డే, టీ20లకు వికెట్ కీపర్ ఎంపికలో కేఎల్ రాహుల్‌కు తొలి ప్రాధాన్యం దక్కనుంది. రిషబ్ పంత్ (3 ఫార్మాట్లు), సంజు శాంసన్ (టీ20లకు మాత్రమే)లకు అవకాశం లభించనుంది. వృద్ధిమాన్ సాహా ఎప్పట్లాగే టెస్టులకు అందుబాటులో ఉంటాడు. ఇక రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్‌ల రూపంలో కొత్త బంతిని ఎదుర్కోగలిగే ఆరుగురు ఓపెనర్లు టీమ్ఇండియాకు అందుబాటులో ఉన్నారు.