ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా ఆల్‌రౌండర్, అరంగేట్ర ఆటగాడు వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్లు రికార్డు సృష్టించారు. గబ్బా మైదానంలో ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
అంతకుముందు ఈ రికార్డు టీమ్ఇండియా మాజీలు కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్‌ల పేరిట ఉంది. వీరు 1991లో ఏడో వికెట్‌కు 58 పరుగులు జోడించారు. ఇప్పుడా రికార్డును సుందర్, ఠాకూర్ అధిగమించి 123 పరుగులు జోడించడం విశేషం.
టెస్టుల్లో ఆస్ట్రేలియాపై ఏడో వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన మూడో జోడీగానూ నిలిచారు.
ఆసీస్‌లో ఏడో వికెట్‌కు గత రికార్డులు..
- 2018-19 సీజన్లో రిషభ్ పంత్, రవీంద్ర జడేజా సిడ్నీ టెస్టులో ఏడో వికెట్‌కు 204 పరుగులు జోడించారు.
- 1947-48 సీజన్లో విజయ్ హజారే, హెచ్ అధికారి అడిలైడ్‌లో ఏడో వికెట్‌కు 132 పరుగులు సాధించారు.
- 1991-92 సీజన్లో అజారుద్దీన్, మనోజ్ ప్రభాకర్ అడిలైడ్‌లో ఏడో వికెట్‌కు 101 పరుగులు జోడించారు.
అరంగేట్రంలోనే..
ఈ క్రమంలోనే అరంగేట్ర టెస్టులో అర్ధశతకం(50కు పైగా పరుగులు) సహా మూడు వికెట్లు తీసిన రెండో భారత క్రికెటర్‌గా సుందర్ ఘనత సాధించాడు. అంతకుముందు 1947-48లో ఆసీస్‌పైనే దత్తు ఫాద్కర్(51, 3/14) ఈ రికార్డు నెలకొల్పిన తొలి టీమ్ఇండియా ఆటగాడు.
టీమ్ఇండియా నిలకడగా ఆడుతోంది. ఆసీస్ స్కోరుకు చేరువలో ఉంది. ప్రస్తుతం 104 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 315 పరుగులు చేసింది. ఠాకూర్ 67 పరుగులు చేసి వెనుదిరిగాడు. క్రీజులో సుందర్(60), సైనీ(0) ఉన్నారు. ఆసీస్ స్కోరుకు 54 పరుగుల వెనుకంజలో ఉంది టీమ్ఇండియా.